Homeఆంధ్రప్రదేశ్‌Kolikapudi Srinivas: కొలికపూడి వీరవిహారం.. ఇక కష్టమే!

Kolikapudi Srinivas: కొలికపూడి వీరవిహారం.. ఇక కష్టమే!

Kolikapudi Srinivas: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో తిరువూరు నియోజకవర్గం ఎప్పుడూ నివురుగప్పిన నిప్పే. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. కానీ ఎందుకో టిడిపి నాయకత్వం వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. కానీ కొలికపూడి మాత్రం తన వ్యవహార శైలి మార్చుకోవడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆయనకు ప్రాధాన్యం తగ్గించింది. ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇది ఎంత మాత్రం కొలికపూడికి మింగుడు పడడం […]

Kolikapudi Srinivas: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో తిరువూరు నియోజకవర్గం ఎప్పుడూ నివురుగప్పిన నిప్పే. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. కానీ ఎందుకో టిడిపి నాయకత్వం వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. కానీ కొలికపూడి మాత్రం తన వ్యవహార శైలి మార్చుకోవడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆయనకు ప్రాధాన్యం తగ్గించింది. ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇది ఎంత మాత్రం కొలికపూడికి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి నేరుగా ఎంపీ చిన్ని తో తలపడి కొలికపూడి కాక రేపారు. తిరువూరు నియోజకవర్గంలో ఆలయ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ విషయంలో దూకుడుగా ముందుకు సాగారు కొలికపూడి.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

* ఆలయ వేడుకల్లో.. తిరువూరు( thiruvuru ) నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలం నెమలిలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా కళ్యాణం ఉత్సవం జరిపారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేసినేని చిన్ని లు సతీసమేతంగా కార్యక్రమానికి హాజరయ్యారు. దేవస్థానం పురోహితులు ఎంపీ కేసినేని చిన్ని చేతికి స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు అందజేశారు. వారికి ఎదురుగా రెండో వైపు ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనకు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వాలని పురోహితులను అడిగారు. పట్టు వస్త్రాలు ఒకరికి మాత్రమే ఇవ్వాల్సి ఉండడంతో పురోహితులు ఇబ్బంది పడి.. కొలికపూడి చేతికి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అయితే ఎంపీ చేతికి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చని ఎమ్మెల్యే కొలికపూడి ఆయన చేతి నుంచి పట్టు వస్త్రాలను బలవంతంగా, విసురుగా లాక్కున్నారు. తన తలపై పెట్టుకుని కళ్యాణ మండపం వద్దకు బయలుదేరారు. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు ఇరు వర్గాలు వాదనలకు దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సద్దుమణిగింది.

* ఆది నుంచి వివాదాలే..
ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఆది నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు వివాదాలకు కొనితెచ్చుకుంటున్నారు. సొంత పార్టీ వారు సైతం ఇక్కడ ఆయన వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. అయినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే రోజురోజుకు కొలికపూడి వ్యవహార శైలి ముదురుతోంది. కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper