Homeఅంతర్జాతీయంUnknown militants attack in Pakistan: ఐపీఎల్‌ సీజన్‌లో సైలెంట్‌ ఆపరేషన్‌.. పాకిస్తాన్‌లో సెంచరీ కొట్టిన...

Unknown militants attack in Pakistan: ఐపీఎల్‌ సీజన్‌లో సైలెంట్‌ ఆపరేషన్‌.. పాకిస్తాన్‌లో సెంచరీ కొట్టిన అజ్ఞాత సాయుధులు!

Unknown militants attack in Pakistan: ఐపీఎల్‌ సీజన్‌ మొదలైంది. రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సెంచరీ ఎవరూ చేయలేదు. హాఫ్‌ సెంచరీలు కొట్టారు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ సమయంలో భారతీయులను అలరించే శుభవార్త ఒకటి పాకిస్తాన్‌ నుంచి అందింది. అదే పాకిస్తాన్‌లోని అజ్ఞాత సాయుధులు సెంచరీ కొట్టారు. భారత వ్యతిరేక ఉగ్రవాదులను, ఉగ్రవాదుల హ్యాండ్లర్స్‌ను, వారికి డబ్బులు ఇచ్చేవారిని, ఉగ్రవాద నాయకులకు సన్నిహితులను ఇప్పటి వరకు 100 మందిని లేపేశారు. ఈ ఆపరేషన్‌లో భారత్‌ […]

Unknown militants attack in Pakistan: ఐపీఎల్‌ సీజన్‌ మొదలైంది. రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సెంచరీ ఎవరూ చేయలేదు. హాఫ్‌ సెంచరీలు కొట్టారు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ సమయంలో భారతీయులను అలరించే శుభవార్త ఒకటి పాకిస్తాన్‌ నుంచి అందింది. అదే పాకిస్తాన్‌లోని అజ్ఞాత సాయుధులు సెంచరీ కొట్టారు. భారత వ్యతిరేక ఉగ్రవాదులను, ఉగ్రవాదుల హ్యాండ్లర్స్‌ను, వారికి డబ్బులు ఇచ్చేవారిని, ఉగ్రవాద నాయకులకు సన్నిహితులను ఇప్పటి వరకు 100 మందిని లేపేశారు. ఈ ఆపరేషన్‌లో భారత్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అధికారికంగా ధ్రువీకరించకపోయినా, పాకిస్తాన్‌లోని భద్రతా వర్గాలు మాత్రం ఇవి భారత గూఢచారి సంస్థల పని అని అనుమానిస్తున్నాయి.

తాజాగా ఇద్దరిని పైకి పంపిన అజ్ఞాత వ్యక్తులు..
తాజాగా అజ్ఞాత దురంధరులు లేపేసిన వారిలో ముఫ్తీ ఆబిద్‌ అలీ ఒకడు. వీడికి రెండు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. మిడిల్‌ లెవల్‌ హ్యాండ్లర్‌గా పనిచేస్తున్నాడు. ఉగ్రవాద ట్రైనర్లకు, భారత్‌లోని ఉగ్రవాదులకు వారధిగా వ్యవహరించేవాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందున గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి, తుపాకీతో కాల్చి చంపేశారు. తర్వాత నాలుగైదు గంటల్లో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన తాలిబాన్‌ వ్యతిరేకి బుర్హాన్‌ను కూడా అజ్ఞాత సాయుధులు చంపేశారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు కాల్చి చంపేశారు. ఇతను పాకిస్తాన్‌లో తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, కానీ భారత్‌కు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

వంద మందిలో కీలక ఉగ్రవాదులు..ఎవరు?
నాలుగేళ్లుగా జరుగుతున్న దురంధర్‌ ఆపరేషన్లలో ఇప్పటి వరకు వంద మంది చనిపోయారు. ఇందులో కీలక ఉగ్రనేతలు కూడా ఉన్నారు. షేక్‌ ముజాహిద్‌ 2016 ఉరీ దాడిలో కీలక పాత్ర పోషించాడు. షాహిద్‌ లతీఫ్‌ 2016 పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌ దాడిసూత్రధారి. ముఫ్తీ ఆబిద్‌ అలీ మిడిల్‌ లెవల్‌ హ్యాండ్లర్‌ ్ఢ భారత్‌–పాక్‌ ఉగ్రవాద నెట్‌వర్క్‌ లింక్‌ నడుపుతున్నాడు. బుర్హాన్‌ ఐఎస్‌ఐఎస్‌ నాయకుడు. తాలిబాన్‌ వ్యతిరేక, భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడు.

సైలెంట్‌ ఆపరేషన్‌..
పాకిస్తాన్‌లో ఈ సైలెంట్‌ ఆపరేషన్‌ పగటిపూట లేదా రాత్రిపూట అకస్మాత్తుగా దాడులు జరుగుతాయి. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి, కాల్చి, పారిపోవడం జరుగుతుంది. నిర్దిష్ట వ్యక్తులను మాత్రమే వీరి టార్గెట్‌. ఎటువంటి సాక్ష్యం మిగలకుండా జాగ్రత్త పడతారు. పాకిస్తాన్‌ ఈ హత్యల గురించి బహిరంగంగా చెప్పదు. ‘తేలుకుట్టిన దొంగలా‘ వ్యవహరిస్తోంది. ఒక నాయకుడిని చంపితే, మరొకరిని తయారు చేస్తోంది. కానీ, ఈ దాడుల వల్ల ఉగ్రవాద నెట్‌వర్క్‌లో గందరగోళం నెలకొంది.

భారత్‌లో కూడా ఏరివేత..
పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధులు హ్యాండ్లర్లను చంపుతుంటే, భారత్‌లో సైన్యం ఉగ్రవాదులను ఏరివేస్తోంది. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదులను వేసవి ఆపరేషన్‌లో లేపేస్తున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో పనిచేసే ఉగ్రవాదులు హతమవుతున్నారు. కీలక నాయకులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధులు వీరిని చంపుతున్నారు.

ఐపీఎల్‌ సీజన్‌లో జరుగుతున్న ఈ సైలెంట్‌ ఆపరేషన్, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. పాకిస్తాన్‌లో 100 మంది భారత్‌ వ్యతిరేకులు చంపబడటం, భారత్‌లో ఉగ్రవాదులు ఏరివేయబడటం – ఇది ఉగ్రవాదానికి చరమ గీతం పాడే సంకేతం కావచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper