Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other title winning couple: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' టైటిల్...

Mad For Each Other title winning couple: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ టైటిల్ గెలుచుకున్న జంట అదే.. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించి ఉండరు..

Mad For Each Other title winning couple: మన తెలుగు ఆడియన్స్ ని నిన్న మొన్నటి వరకు రియాలిటీ షో అంటే ‘బిగ్ బాస్’ మాత్రమే తెలుసు. ప్రతీ ఏడాది ఈ రియాలిటీ షో కోసం వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ‘బిగ్ బాస్’ తరహా రియాలిటీ షోస్ ఇంకా చాలా ఉన్నాయని రీసెంట్ గా మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other) షో ని చూసిన […]

Mad For Each Other title winning couple: మన తెలుగు ఆడియన్స్ ని నిన్న మొన్నటి వరకు రియాలిటీ షో అంటే ‘బిగ్ బాస్’ మాత్రమే తెలుసు. ప్రతీ ఏడాది ఈ రియాలిటీ షో కోసం వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ‘బిగ్ బాస్’ తరహా రియాలిటీ షోస్ ఇంకా చాలా ఉన్నాయని రీసెంట్ గా మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other) షో ని చూసిన తర్వాతే తెలుసుకున్నారు మన ఆడియన్స్. రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ఈ రియాలిటీ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రెండు వారాల్లో ఒక వారం ఎలిమినేషన్ ని రద్దు చేయగా, రెండవ వారం లో హరిత హరీష్ జంట ఎలిమినేట్ అయ్యింది. వీళ్ళు నిన్న జడ్జీలతో వ్యవహరించిన తీరుకి వాళ్ళు ఎంత అసహనానికి గురయ్యారో మన కళ్లారా చూశాము.

లవ్ మ్యాన్షన్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నిన్నటి వరకు హరీష్ వేసిన నాటకాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రపంచం లో మమల్ని మించిన జంట ఎక్కడా లేదు, మేము మాత్రమే గొప్ప , మిగిలిన వాళ్లంతా ఫేక్ అనే ధోరణి లో హారీష్ ప్రవర్తించాడు. బిగ్ బాస్ 9 లో కూడా ఇలాగే ప్రవర్తించేవాడు. జనాలు ఇతని అతని భరించలేక నాల్గవ వారం లోనే గెంటేశారు. ఇక్కడ కూడా అదే డ్రామా చేయడం, షో ఫార్మాట్ ని గౌరవించకపోవడం, కంటెస్టెంట్స్ పై ఇష్టమొచ్చినట్టు నోరు జారడం వంటివి చాలానే చేసాడు. అందుకే జడ్జీలకు కూడా సహనం కోల్పయి ఇతనికి బాండ్ క్రెడిట్స్ ఇవ్వలేదు. అలా ఇతని ఎలిమినేషన్ జరిగింది. ఇక మిగిలిన వారాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని కూడా రీసెంట్ గానే పూర్తి చేశారట.

ఎవరెవరు ఏ వారం లో ఎలిమినేట్ అయ్యారు, చివరికి ఎవరు టైటిల్ గెలుచుకున్నారు అనేది ఇప్పుడు వివరంగా మనం చూడబోతున్నాం . రెండవ ఎలిమినేషన్ ప్రక్రియ లో మహేష్ – సాండ్రా జంట ఎలిమినేట్ అవ్వగా, మూడవ ఎలిమినేషన్ ప్రక్రియ లో సంధ్య – బ్రిటో జంట, నాల్గవ ఎలిమినేషన్ ప్రక్రియ లో ప్రియాంక – శివ్ జంట, 5 వ ఎలిమినేషన్ ప్రక్రియ లో అంజలి – పవన్ జంట ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. నాలుగు ఎలిమినేషన్స్ అయ్యాక, ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారట. వారిలో ఒకరు మహేష్ – సాండ్రా కాగా, మరొకరు యోగా జంట అట. 6 వ ఎలిమినేషన్ ప్రక్రియ లో ఈ యోగా జంట ఎలిమినేట్ అవ్వగా, చివరి ఎలిమినేషన్ ప్రక్రియ లో సోనియా – సిద్దు జంట ఎలిమినేట్ అయ్యిందట. చివరిగా మిగిలిన టాప్ 5 జోడీలలో మహేష్ – సాండ్రా జంట టైటిల్ గెలుచుకున్నట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper