Narendra Modi : 80 వ స్వాతంత్ర వేడుకలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో ప్రధానంగా సప్త ధార గురించి ప్రస్తావించారు. గతాని కంటే భిన్నంగా ఈసారి మోడీ తక్కువ సమయం మాట్లాడినప్పటికీ.. అసలైన విషయాల గురించి ప్రస్తావించారు.
గతంలో కరోనా సమయంలో దేశ ప్రధాని ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. అంతకుముందు మేకింగ్ ఇండియా కార్యక్రమాన్ని అమలులోకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా సప్త ధారను ప్రకటించారు. దీని ప్రకారం భారత దేశంలో తయారీ పరిశ్రమ వేగవంతం కానుందిని నరేంద్ర మోడీ ప్రకటించారు. తయారీ రంగం.. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగం.. ఏఐ డీప్ టెక్.. డిఫెన్స్.. కనెక్టివిటీ.. గ్రీన్ బ్లూ ఎకానమీ విస్తరణ.. సాఫ్ట్ పవర్ సెక్టార్ల మీద ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకునే విధంగా భారతదేశానికి ఈ పాలసీ అత్యంత కీలకమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
చైనా తయారీ రంగంలో.. అమెరికా ఏఐ డీప్ టెక్ లో.. ఇజ్రాయిల్ డిఫెన్స్ లో.. రష్యా కనెక్టివిటీలో.. యూరప్ దేశాలు గ్రీన్ బ్లూ ఎకానమీలో అద్భుతాలు సాధిస్తున్నాయి. అయితే ఈ రంగాలు మొత్తం భారతదేశంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత దేశంలో ఉంది. పైగా యువశక్తి కూడా ఈ దేశానికి ప్రధాన బలం. అందువల్లే ఈ స్థాయిలో భారత్ ఈ రంగాల మీద దృష్టి పెట్టింది.
సప్త ధారలో భాగంగా దశాబ్దాలుగా సాధించాలని అభివృద్ధిని దీని ద్వారా కేవలం ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోనే చేసి చూపించవచ్చని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ప్రకృతి, తీర ప్రాంతాల వనరుల మీద పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్రీన్ బ్లూ ఎకానమీ ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సాఫ్ట్ పవర్ లో భాగంగా.. భారతదేశ సంస్కృతిని.. సంప్రదాయాలను.. యోగ.. ఆయుర్వేదం.. యునాని వంటి వైద్య విధాలను విస్తరించి.. భారత బ్రాండ్ మొత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. తయారీ రంగం.. వ్యవసాయం.. టెక్నాలజీ.. రోడ్ల అనుసంధానం.. డిఫెన్స్ వంటి రంగాలలో భారీగా ఉపాధి అవకాశాలు.. పెట్టుబడులు పెట్టడం ద్వారా.. ఎక్కువ అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ రంగాలలో భారతదేశంలో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. పైగా వీటి ఎగుమతులను ఇతర దేశాలకు పంపించడానికి ఆస్కారం ఉంది. అందువల్లే సప్త ధారలో నరేంద్ర మోడీ ఈ రంగాలను పదే పదే ప్రస్తావించారు. భవిష్యత్తు కాలంలో వీటి ఆధారంగానే ప్రపంచ మనుగడ సాగుతుంది. అందువల్లే వీటి మీద నరేంద్ర మోడీ దృష్టిపెట్టి.. తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
ప్రపంచం మొత్తం ప్రస్తుతం టెక్నాలజీలో దూసుకుపోతోంది. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టిన దేశాలు పండగ చేసుకుంటున్నయి. టెక్నాలజీ ముందుకు నడవాలంటే ఖచ్చితంగా సెమీ కండక్టర్లు ఇప్పుడు చాలా అవసరం. సెమీ కండక్టర్లకు సంబంధించి ప్రపంచ అవసరాలను తైవాన్ తీరుస్తోంది. దక్షిణ కొరియాకు కూడా ఇందులో భాగముంది. అయితే ఇప్పుడు సెమీ కండక్టర్ల తయారీలో భారత్ కూడా ప్రగతిని సాధిస్తుంది. వచ్చే రోజుల్లో సొంతంగా వీటిని తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందువల్ల నరేంద్ర మోడీ తన సప్త ధార కార్యక్రమంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఇక సముద్ర తీర ప్రాంతాలలో పర్యటకానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.
మాల్దీవులు వంటి దేశం ఆర్థికంగా ఒకప్పుడు బలంగా ఉందంటే దానికి ప్రధాన కారణం తీర ప్రాంత పర్యాటకమే. మనదేశంలో తీర ప్రాంత రాష్ట్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఇప్పటికీ అనుకున్న స్థాయిలో టూరిజం అభివృద్ధి కాలేదు. ఆ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి.. టూరిజం డెవలప్ చేస్తే అవకాశాలు పెరుగుతాయి. విదేశీ మారకద్రవ్యం కూడా అధికంగా వస్తుంది. టెక్నాలజీ.. వ్యవసాయం.. రోడ్ల అనుసంధానం వంటి వాటిల్లో భారీగా పెట్టుబడులు గనుక పెరిగితే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. వాటి ద్వారా ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తుంది. తద్వారా దేశం ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
image.png