Homeఅంతర్జాతీయంHeraf 2.0 Balochistan: బలోచిస్తాన్లో హెరాఫ్ 2.0 అద్భుతం.. దిక్కుతోచక పాకిస్తాన్ ఏం చేస్తుందంటే?

Heraf 2.0 Balochistan: బలోచిస్తాన్లో హెరాఫ్ 2.0 అద్భుతం.. దిక్కుతోచక పాకిస్తాన్ ఏం చేస్తుందంటే?

Heraf 2.0 Balochistan: బలూచిస్తాన్‌.. పాకిస్తాన్‌లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. అరుదైన మినరల్స్‌కు నిలయం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా బలూచిస్తాన్‌.. పాకిస్తాన్‌లోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా వెనుకబడింది. ఇక్కడి సంపదను తరలించుకుపోతున్న పాక్‌ పాలకులు అభివృద్ధి విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బలూచ్‌ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నారు. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాక్‌ సైనికులు, పాలకులపై తిరుగుబాటు చేస్తోంది. తాజాగా హెరాఫ్‌ […]

Heraf 2.0 Balochistan: బలూచిస్తాన్‌.. పాకిస్తాన్‌లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. అరుదైన మినరల్స్‌కు నిలయం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా బలూచిస్తాన్‌.. పాకిస్తాన్‌లోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా వెనుకబడింది. ఇక్కడి సంపదను తరలించుకుపోతున్న పాక్‌ పాలకులు అభివృద్ధి విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బలూచ్‌ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నారు. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాక్‌ సైనికులు, పాలకులపై తిరుగుబాటు చేస్తోంది. తాజాగా హెరాఫ్‌ 2.0 పేరుతో చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. దీంతో పాకిస్తాన్‌ దిక్కుతోచని స్థితిలో పడింది.

హెరాఫ్‌ 2.0..
బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) హెరాఫ్‌ 2.0 అభియానాన్ని 2025 మే నుంచి ప్రారంభించింది. బలూచిస్తాన్‌లోని 10 నగరాల్లో పాక్‌ సైన్య, వ్యవహారాలపై సమన్వయ దాడులు చేస్తోంది. క్వెట్టా, గ్వాదర్, పంజ్‌గూర్‌లతో పాటు షాల్, నోష్కీలో కొనసాగుతున్న ఈ దాడులు పాక్‌ బలగాలపై ఒత్తిడి పెంచాయి. బీఎల్‌ఏ ప్రవక్త జీయాంద్‌ బలొచ్‌ దీన్ని ‘నిర్ణయాత్మక ప్రతిఘటన’గా పేర్కొన్నారు.

ఎన్‌ఫోర్స్‌డ్‌ డిస్‌అపియరెన్సెస్‌
పాక్‌ ఆర్మీ తిరుగుబాటుకు ప్రతిస్పందనగా బలూచ్‌ పౌరులను బలవంతంగా ఎత్తుకెళ్తోంది. ‘కిల్‌ అండ్‌ డంప్‌’ విధానం అమలు చేస్తోంది. బలూచ్‌ యాక్జెహ్తి కమిటీ (బీవైసీ) రిపోర్టుల ప్రకారం, 2025 జులై–ఆగస్టులో 123 డిస్‌అపియరెన్సెస్, 26 హత్యలు నమోదయ్యాయి. లాహోర్, క్వెట్టాలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు సహా యువకులు కిడ్నాప్‌ అయ్యారు.

శవాలుగా రోడ్ల పక్కన..
ఈ కిడ్నాప్‌లు పాకిస్తాన్‌ పాలకులే చేయిస్తున్నారు. కానీ తమకు తెలియదని బుకాయిస్తున్నారు. తర్వాత కొన్ని రోజులకు వారి శవాలను రోడ్లపక్కన పడేస్తున్నారు. తాజాగా పంజ్‌గూర్‌లో హయాత్‌ ఏడుగురు బలూచ్‌ పౌరుల శవాలు ఉన్నాయి. టర్బత్‌ నుంచి అప్హరించినట్టు బాధిత కుటుంబం ఆరోపించింది. కరాచీలో 24 ఏళ్ల విద్యార్థి హమ్దాన్‌ బలొచ్‌ ’ఫేక్‌ ఎన్‌కౌంటర్‌’లో చంపేశారు. కుటుంబం శవం ఇవ్వకపోవడంపై ఆందోళన చేసింది. లాహోర్, పంజ్‌గూర్‌లో మరిన్ని శవాలు దొరికి, టార్చర్‌ గాయాలు కనిపించాయి.

హెరాఫ్‌ 2.0 వంటి దాడులు బలూచ్‌ తిరుగుబాటును బలోపేతం చేస్తుంటే, పాక్‌ ఆర్మీ సివిలియన్లపై ఎక్స్‌ట్రాజుడీషియల్‌ కిలింగ్స్‌తో స్పైరల్‌ పెరుగుతోంది. హ్యూమన్‌ రైట్స్‌ గ్రూపులు ఐక్యరాష్ట్ర సమితి జోక్యాన్ని కోరుతున్నాయి. ఇది 1971 బంగ్లాదేశ్‌ ఘటనలతో పోల్చబడుతూ, ప్రాంతీయ అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper