Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy Heritage Controversy: హెరిటేజ్-ఇండాపూర్.. ఆవు పులి కథ చెబుతున్న జగన్

Jagan Mohan Reddy Heritage Controversy: హెరిటేజ్-ఇండాపూర్.. ఆవు పులి కథ చెబుతున్న జగన్

Jagan Mohan Reddy Heritage Controversy: చిన్నపిల్లాడి చాక్లెట్ తగువు మాదిరిగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పరిస్థితి. టిటిడి నెయ్యి కల్తీ కి సంబంధించి మరక తనకు అంటుకోవడంతో.. తాను ఒక్కడినే కాదు.. చంద్రబాబుకు సైతం ఇందులో పాత్ర ఉందని చెప్పేందుకు జగన్ ఆరాటపడుతున్నారు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చెబుతున్న పిట్ట కథలు.. ఎక్కడెక్కడివో తెస్తున్న లింకులు వెగటు పుట్టిస్తున్నాయి. అయితే ఇటువంటి మాటలు 2014 నుంచి 2019 మధ్య ప్రజలు విన్నారు. ఎందుకంటే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చే స్క్రిప్ట్ వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ మాత్రం నమ్మదగినదిగా లేదు. గురువారం వారాంతపు ప్రెస్మీట్లో హెరిటేజ్ కంపెనీకి నెయ్యి మరక అంటించేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. తాను అమాయకుడిగా హావభావాలు పలికిస్తూ.. ప్రజలు అమాయకుల అన్నట్టు ఆయన మాటలు ఉన్నాయి.

* ఓ చిన్న స్క్రీన్ షాట్ తో
ఇండాపూర్ డైరీ తో( Indapur diary) హెరిటేజ్ కు సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే వాటి రెండింటి మధ్య బంధం ఇండియా మార్ట్ అనే వెబ్సైట్లో ఉందట. అదే తిరుగులేని సాక్ష్యం అట. దానినే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీడియా సమావేశంలో నమ్మించే ప్రయత్నం చేశారు. ఇండియా మార్ట్ అనేది ఓ మార్కెటింగ్ సైట్. ఓ పేజీ క్రియేట్ చేసుకుని ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు. ఆ విషయం సోషల్ మీడియాతో పాటు వెబ్సైట్లపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను చెప్పింది ప్రజలు నమ్ముతారని చెప్పి.. ఏదో ఒక లింకు చూపెట్టి.. అత్యవసరంగా హెరిటేజ్ ను డామేజ్ చేయాలి. ప్రజల దృష్టిని మరల్చగలగాలి.

* హెరిటేజ్ స్పష్టమైన ప్రకటన చేసినా..
ఇండాపూర్ డైరీ విషయంలో హెరిటేజ్( heritage) స్పష్టమైన ప్రకటన చేసింది. చీజ్ విషయంలో సహా ఉత్పత్తిదారు అని స్పష్టం చేసింది. చీజ్ ఉత్పత్తుల విషయంలో ఇండాపూర్ డైరీ కి మంచి పేరు ఉంది. అదేదో కొత్త విషయం అన్నట్టు.. అలా చీజ్ విషయంలో ఉత్పత్తుల సహకారం తీసుకున్నందున ఆ డైరీ హెరిటేజ్ దని కొత్త ప్రచారం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ కంపెనీకి కొంత వస్తే.. దానిని హెరిటేజ్ కు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కల్తీ వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఓ తప్పుడు పనిని సమర్ధించుకోలేక.. దానిని ప్రత్యర్థులపై పెట్టేందుకు తెగబడే మనస్తత్వం ఆయనది. నిన్న ప్రెస్మీట్లో అదే స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో స్పష్టమైన వివరాలు ఉంటాయి. హెరిటేజ్ లిమిటెడ్ కంపెనీ. ఏ కంపెనీతో అనుబంధం ఉన్న స్టాక్ మార్కెట్ కు చెప్పాల్సి ఉంటుంది. హెరిటేజ్ ఆ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించింది. కానీ జగన్మోహన్ రెడ్డికి అవేవీ పట్టవు కదా. తాను చెప్పిందే నిజం.. చేస్తోంది కరెక్ట్ అన్నట్టు ఉంటుంది ఆయన వాదన.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular