Elon Musk
Elon Musk : ప్రపంచంలో టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్‌్ట. నూతన ఆవిష్కరణలతోపాటు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కూడా వేగంగా దూసుకుపోతోంది. ఈ రెండింటిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టార్గెట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో‍్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం కృషి చేశారు. ట్రంప్ తరఫున ప్రచారం చేశారు. నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఇక తన విజయానికి సహకరించిన మస్‌్కకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ట్రంప్ అధికారం చేపట్టక ముందే మస్క్ స్పీడ్ పెంచారు. రహస్యంగా ఇరాన్ విదేశాంగ శాఖ కార్యదర్శితో భేటీ అయా‍్యరు. తాజాగా తన శత్రువులను టార్గెట్ చేస్తున్నారు.
ఓపెన్ ఏఐపై దావా..
తాజాగా ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్టమన్‌పై దావా వేశారు. అందులోకి మైక్రోసాఫ్ట్‌ను కూడా లాగారు. గతంలో దావా వేసి ఉప సంహరించుకున్న మస్క్.. తాజాగా మైక్రోసాఫ్ట్ పేరును జోడించి మరోమారు దావా వేయడం చర్చనీయాంశమైంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏఐ మార్కెట్‌లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తున్నాయని తాజాగా రోపించారు. మైక్రోసాఫ్ట్‌తోపాటు లింక్లిన్ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్, ఓపెన్ ఏఐ మాజీ బోర్డు సభ్యుడు, మైక్రోసాఫ్ట్ పీవీడీ టెంపుల్‌టన్ పేర్లు తాజా దావాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఓపెన్ ఏఐలో పెట్టుబడి…
ఓపెన్ ఏఐని శాం ఆల్టమన్ 2015లో స్థాపించాడు. అప్పడు మస్‌్క అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో కంపెనీని వీడారు. ఇక 2019లో మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. 2022, నవంబర్‌లో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ప్రారంభించింది. ఇది కేవలం ఆరు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదారణ పొందింది. ఇక ఈ ఏడాది మార్చిలో శామ్ ఆల్టమన్‌పై దావా వేసిన మస్క్.. కంపెనీ స్థాపించిన సమయంలో రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని ఆరోపించారు. కానీ, జూన్‌లో దావాను ఉప సంహరించుకున్నారు.
దావా పునరుద్ధరణ..
అంతర్జాతీయ మీడియా ప్రకారం.. తాజాగా మస్క్ పాత దావాను పునరుద్ధరించారు. ఇందులో మైక్రోసాఫ్ట్ పేరును కూడా చేరా‍్చరు. రెండు కంపెనీలు అవగాహనతో ఏఐ రంగంలో పోటీ లేకుండా చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. దీంతో ఇతర కంపెనీలకు నిధులు రావడం లేదని పేర్కొన్నారు. తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ ఏఐకి కూడా నిధులు రావడం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఓపెన్ ఏఐ 6.6 బిలియన్ డాలర‍్ల నిధులు అందుకుంది. మస్క్ స్థాపించిన ఎక్స్ ఏఐకి మాత్రం మార్చిలో 6 బిలియన్ డాలర్ల సొంత నిధులను సమకూర్చుకున్నాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Elon musk targeting open ai microsoft
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com