Homeబిజినెస్Microsoft: కుప్పకూలిన మైక్రోసాఫ్ట్.. 26 ఏళ్ల తర్వాత..ఇదే తొలిసారి.. తదుపరి ఏం జరగనుంది

Microsoft: కుప్పకూలిన మైక్రోసాఫ్ట్.. 26 ఏళ్ల తర్వాత..ఇదే తొలిసారి.. తదుపరి ఏం జరగనుంది

Microsoft: ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన కంపెనీగా మైక్రోసాఫ్ట్ కి పేరుంది. ఈ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా కొన్ని సంవత్సరాలపాటు కొనసాగారు. పథకాలంగా బిల్ గేట్స్ తన ఆదాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఆవిష్కరణ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించి కొత్త కొత్త టూల్స్ తయారు చేస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేరు ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో వినిపించింది. […]

Microsoft: ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన కంపెనీగా మైక్రోసాఫ్ట్ కి పేరుంది. ఈ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా కొన్ని సంవత్సరాలపాటు కొనసాగారు. పథకాలంగా బిల్ గేట్స్ తన ఆదాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఆవిష్కరణ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించి కొత్త కొత్త టూల్స్ తయారు చేస్తోంది.

ఇటీవల మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేరు ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో వినిపించింది. కొన్ని రకాల ఆరోపణలు కూడా అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి అతడు పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అయితే బిల్ గేట్స్ నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ నెలలో అతిపెద్ద నష్టాలను చవిచూసింది. ఈ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. గడచిన నెలలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 17 శాతం పడిపోయాయి. కంపెనీ విలువపరంగా చూసుకుంటే దాదాపు 53.9 లక్షల కోట్ల తగ్గుదల చోటుచేసుకుంది.

డిసెంబర్ 2000 సంవత్సరం తర్వాత మైక్రోసాఫ్ట్ ఇదే అతిపెద్ద డౌన్ ఫాల్. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద ఈ కంపెనీ భారీగా పెట్టుబడిపెడుతోంది. డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఏఐ చిప్స్.. క్లౌడ్ సర్వీసులు.. కో పైలట్ వంటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తుల డెవలప్మెంట్ కోసం భారీగా ఖర్చుపెడుతోంది. అయితే ఇంత కష్టపడుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

ఇక ఇటీవల త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అజుర్ క్లౌడ్ సేవల అభివృద్ధి ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉంది. ఇది పెట్టుబడిదారుల్లో ఒక రకమైన ఆందోళన కలిగించింది. అయితే వచ్చే రోజుల్లో లాభాల వృద్ధిని కొనసాగిస్తామని.. పెట్టుబడులు కూడా అదే స్థాయిలో సాగిస్తామని కంపెనీ చెబుతోంది. కంపెనీ ఈ స్థాయిలో చెబుతున్నప్పటికీ లాభాల కంటే ఖర్చులే పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది..

2008లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పుడు ప్రభుత్వ ఇన్వెస్టర్ మైకేల్ బరి మైక్రోసాఫ్ట్ షేర్ల మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అప్పుడు అది చర్చకు దారి తీసింది. ఆయన నిర్ణయం వల్ల కంపెనీ షేర్లు అప్పట్లో కొంతమేరకు కోలుకున్నాయి. అయితే ఇప్పటి పరిస్థితుల్లో కూడా మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు అవకాశం ఉందని తెలుస్తోంది. దీర్ఘకాలంలో ఇవి లాభాలు తెస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper