Bike Offers : సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి సమయంలో కంపెనీలు ద్విచక్ర వాహనాల మీద భారీగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటిస్తుంటాయి. కస్టమర్లకు అనుకూలమైన ఈఎంఐ ఆప్షన్లు ఇస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు దసరా లేదు. దీపావళి ఇప్పట్లో రాదు. సంక్రాంతికి కూడా చాలా సమయం ఉంది. పండగలు కాకపోయినప్పటికీ బైక్ కంపెనీలు బ్రహ్మాండమైన డిస్కౌంట్లు ప్రకటించాయి. ఒక రకంగా బైకులు కొనాలి అనుకునే వారికి ఇప్పుడు పండగే పండుగ.
మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఎంట్రీ లెవెల్ కం మ్యూటర్ లతో పాటుగా 125 160 సిసి రేంజ్ లో ఉన్న ద్విచక్ర వాహనాలపై మెరుగైన డీల్స్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ద్విచక్ర వాహనాలను ఇష్టపడే వాళ్లకోసం క్యాష్ డిస్కౌంట్లు.. ఎక్స్చేంజ్ ఆఫర్లు.. డీలర్ ఈఎంఐ స్కీములు రెడీగా ఉన్నాయి. వీటితోపాటు ఈవీ బ్రాండ్లు కూడా ఫైనాన్స్ పరంగా కస్టమర్లకు ఆఫర్లను ఇస్తున్నాయి. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రకరకాల బ్రాండ్లు.. ఆయన నగరాల ఉన్న ధరలు.. ఇలా ప్రతి అంశాన్ని మీకు అందిస్తున్నాం.
డీలర్ల వద్ద ఈ నెలలో కూడా ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. పాత బైకులు మార్చుకోవడం.. స్క్రాప్ బెనిఫిట్స్ వంటి వాటిల్లో హీరో కంపెనీ ముందు వరుసలో ఉంది. కస్టమర్లను ఈ కంపెనీ విపరీతంగా ఆకట్టుకుంటున్నది. దీనికి తోడు బజాజ్.. టీవీఎస్ కూడా ఆన్లైన్ ఫైనాన్స్ ద్వారా కస్టమర్లకు అత్యంత ఈజీ మెథడ్స్ లో వాహనాలను అందిస్తున్నాయి. హోండా.. సుజుకి కంపెనీలు కూడా బ్రహ్మాండమైన డిస్కౌంట్లు అందిస్తున్నాయి. కాకపోతే ఇవి స్థానికంగా ఉన్న డీలర్ల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అందువల్లే కస్టమర్లు ఆయా షోరూంలకు వెళ్లి ద్విచక్ర వాహనాలకు కొనుగోలు సమయంలో బేరం ఆడుకోవచ్చు. దీనికి తోడు వి ఐ ఎన్ తయారీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ ముగిసేలోపు ఈ సెప్టెంబర్ నెలలో ఆఫర్లు మారవచ్చు.
హీరో కంపెనీ స్క్రాపింగ్ ఎక్స్చేంజ్.. ఇతర ఆఫర్ల కింద కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి తోడు గ్రీన్ బోనస్ ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ 9000 లేదా అతి తక్కువ డౌన్ పేమెంట్ అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తోంది. సులభమైన ఈఎంఐ ఆప్షన్లతో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
ఈవీ వెహికల్స్ విషయంలో కూడా ఫైనాన్స్ ఆఫర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక టీవీఎస్ ఐ క్యూబ్ కొనుగోలు చేసే వారికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంది.
ఓలా కంపెనీ లో కాస్ట్ ఇఎంఐ తో పాటు పదివేల స్కూటర్ డిస్కౌంట్ లేదా బైక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
అయితే ఈ ఆఫర్లు నగరాల వారిగా మారుతూ ఉంటాయి. లక్ష నుంచి మొదలు పెడితే 1,60,000 బడ్జెట్ పరిధిలో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటే.. ముందుగా డీలర్ కోట్ పోల్చి చూసుకోవాలి. ఈఎంఐ ప్లాన్ చేసుకోవాలి. మరోవైపు ఈఎంఐ ప్లాన్ చేసుకునే క్రమంలో సాధారణ డౌన్ పేమెంట్ విషయాన్ని కూడా పరిశీలించాలి. బ్యాంకు వడ్డీ రేట్లను అంచనా వేయాలి. ఆ తర్వాత క్రెడిట్ ప్రొఫైల్.. విఐఎన్ స్టాక్ ను కూడా సరిచూసుకోవాలి.