Homeఅంతర్జాతీయంTrump speech impact Pakistan: ట్రంప్‌ ప్రసంగం.. పాక్‌లో భూకంపం!

Trump speech impact Pakistan: ట్రంప్‌ ప్రసంగం.. పాక్‌లో భూకంపం!

Trump speech impact Pakistan: పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు అవమానాల మీద అవమానాలు, చీదరింపులు, ఈసడింపులు ఆగడం లేదు. అదీ డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి రావడమే విషాదకరం. ట్రంప్‌ను స్తుతించడం, ట్రంపు నామం జపించడం, ట్రంప్‌ స్తోత్రం పారాయాణం చేయడం షెహబాజ్‌కు అలవాటే కానీ, ట్రంప్‌ మాత్రం ఆయనను పూచికపుల్లలా తీసేస్తున్నారు. అమెరికాలో స్టేట్‌ ఆఫ్‌ది యూనియన్‌ స్పీచ్‌ ఇస్తారు. తాజాగా ఈ స్పీచ్‌లో అంతర్గత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అంతర్గత పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలు, దౌత్య వ్యవహారాలపై మాట్లాడతారు. దీనిని అందరూ ఆసక్తిగా వింటారు. ట్రంప్‌ ఫిబ్రవరి 25న స్పీచ్‌ ఇచ్చాడు. 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. తన విజాయాలు, ఘనలు, గొప్పలు చెప్పుతూ వచ్చాడు. 8 యుద్ధాలను ఆపానని క్లెయిమ్‌ చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆయన అన్న మాట పాకిస్తాన్‌లో భూకంపం తెచ్చింది. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.

ట్రంప్‌ ఏమన్నాడు..
డొనాల్డ్‌ ట్రంప్‌ స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ స్పీచ్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పరువు తీశాడు. 2026, ఫిబ్రవరి 25న చేసిన ప్రసంగం పాకిస్తాన్‌లో గందరగోళానికి కారణమైంది. డొనాల్డ్‌ ట్రంప్‌ తన రెండో మొదటి 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపినట్లు పేర్కొన్నారు. ఇందులో భారత్‌–పాక్‌ మధ్య 2025 ఆపరేషన్‌ సిందూర్‌లోని సంఘర్షణ కూడా ఉందని చెప్పారు. 35 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసే ఆపరేషన్‌ సిందూర్‌ను తాను ఆపి ఉండకపోతే పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చచ్చిపోయేవాడు అని పేర్కొన్నారు. ఆ తర్వాత జారీ చేసిన ప్రసంగం కాపీలో కూడా ఇది స్పష్టంగా ఉంది. పాకిస్తాన్‌లో దీనిపై గందరగోళం నెలకొంది.

Also Read: నిప్పుతో నేషనల్‌ గేమ్స్‌ ఆడుతోంది.. పాకిస్తాన్‌ మళ్లీ అదే తప్పు చేస్తోంది..

స్పందించని పాక్‌..
ట్రంప్‌ ప్రకటనపై పాకిస్తాన్‌ స్పందించలేదు. ప్రకటనను ఖండించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌ను ట్రంప్‌ చెప్పకనే చెప్పారు. పాకిస్తాన్‌ను ఎలా కుదిపేసిందో ఒక్క మాటలో స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బను భరించలేకనే పాకిస్తాన్‌ అమెరికా శరణు కోరిందని ఈ ప్రసంగం ద్వారా ట్రంప్‌ అంగీకరించినట్లు అయింది. మరోవైపు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం ట్వీట్‌లో స్పీచ్‌ను స్పల్పంగా మార్చి ట్వీట్‌ చేశాడు.

బ్యాక్‌డోర్‌ ప్రయత్నం..
ఇక మన రఫేల్‌లు ఎన్ని కూలిపోయాయని మన విపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తాన్‌ కూడా తాము భారత యుద్ధ విమానాలు కూల్చామని ప్రకటించింది. కానీ ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇక విశేషం ఏమిటంటే పాకిస్తాన్‌ ట్రంప్‌ ప్రకటనను ఖండించలేదు. అసలు దానిపై స్పందించలేదు. బహుశా బ్యాక్‌ డోర్‌ నుంచి దీనిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మాత్రం ఓ ట్వీట్‌ చేసింది. ట్రంప్‌ స్పీచ్‌లోని కొంత మార్చింది. 35 మిలియన్ల మంది పాక్‌ ప్రధాని చెప్పినట్లు అని కామాలు మార్చారు. కానీ ప్రసంగంలో ట్రంప్‌ షెహబాజ్‌ చనిపోయావాడని చెప్పారు.

ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపడంతో మూడో పక్ష జోక్యం లేదని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. డీజీఎంవోల స్థాయి చర్చలు మాత్రమే కీలకమని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చెప్పారు. ట్రంప్‌ క్లెయిమ్‌లు పాక్‌ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ట్రంప్‌ను పాక్‌ శరణు కోరడంతోనే భారత్‌ను శరణు కోరమని అమెరికా సూచన చేసినట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular