Pakistan-Afghanistan tensions: తప్పులు చేయడంలో పాకిస్తాన్‌కు ఉన్న తెలివితేటలు మరే దేశానికి లేవు. 1965లో భారతదేశంతో యుద్దం చేసి తప్పు చేసింది. 1971లో బంగ్లాదేశ్(తూర్పు పాకిస్తాన్)తో యుద్ధం చేసి తప్పు చేసింది. కార్గిల్ యుద్ధంతో మరో తప్పు చేసింది. ఇలా పదే పదే తప్పులు చేస్తోంది. ఏక కాలంలో అమెరికా, చైనా, తాలిబాన్లతో స్నేహం చేసి తప్పులు చేసింది. తాజాగా పాకిస్తాన్‌మరో భారీ తప్పు చేసింది. పశ్చిమ దిశన తన దేశంతో 2 వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దు […]
Pakistan-Afghanistan tensions: తప్పులు చేయడంలో పాకిస్తాన్‌కు ఉన్న తెలివితేటలు మరే దేశానికి లేవు. 1965లో భారతదేశంతో యుద్దం చేసి తప్పు చేసింది. 1971లో బంగ్లాదేశ్(తూర్పు పాకిస్తాన్)తో యుద్ధం చేసి తప్పు చేసింది. కార్గిల్ యుద్ధంతో మరో తప్పు చేసింది. ఇలా పదే పదే తప్పులు చేస్తోంది. ఏక కాలంలో అమెరికా, చైనా, తాలిబాన్లతో స్నేహం చేసి తప్పులు చేసింది. తాజాగా పాకిస్తాన్‌మరో భారీ తప్పు చేసింది. పశ్చిమ దిశన తన దేశంతో 2 వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దు ఉన్న ఆఫ్గానిస్తాన్‌పై వైమానికి దాడి చేసింది. ఎఫ్16, జేఎఫ్17 వంటి ఖరీదైన విమానాలతో బాంబుదాడులు చేసింది. ఈ దాడిలో 17 మంది చనిపోయారు. ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదు. ఇక తెహ్రీక్ ఏ తాలిబార్ ఉన్నట్లుగా భావించే ఇళ్లను ధ్వంసం చేసింది. ఒక్క ఉగ్రవాది చనిపోలేదు. సామాన్యులు, మహిళలు, పిల్లలు చనిపోయారు. 40 ఏళ్లు తానే శిక్షణ ఇచ్చిన తాలిబాన్లపై దాడులు చేయడం గమనార్హం. తాను ప్రోత్సహించిన తాలిబాన్‌పై దాడి చేయడం మరో మూర్ఖత్వం.
Also Read: మోదీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?
ఆర్థిక నష్టమే..
134 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు, దేశ ఆదాయంలో 84% రుణ చెల్లింపులకే వెచ్చిస్తున్న పాకిస్తాన్ తాజాగా ఆఫ్గానిస్తాన్‌పై దాడులకు భారీగా ఖర్చు చేస్తోంది. ఖరీదైన యుద్ధ విమానాలు వాడుతోంది. అందులో ఇంధనానికి మరింత ఖర్చు చేస్తోంది. మెయింటెనెన్స్‌కు లక్షల డాలర్లు వృథా చేస్తోంది. ఆఫ్గానిస్తాన్‌లోని మట్టి ఇళ్లను కూల్చడానికి 24–30 వేల డాలర్లు ఖర్చు చేస్తోంది. కానీ ఇళ్లు కూలితే ఆఫ్గాన్లు కట్టుకోవడానికి రూ.2 లక్షలకు మించి ఖర్చు కాదు. ఇక సైనికులు కూడా యుద్ధాలకు భయపడుతున్నారు. రాజీనామా చేస్తున్నారు. దీంతో మరణించే సైనికులకు ఇచ్చే పరిహారాన్ని పాకిస్తాన్ రెట్టింపు చేసింది. దీంతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతోంది.
ఈ యుద్ధంతో నిరుద్యోగం, అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. ఆఫ్గాన్‌తో శత్రుత్వం పెంచుకుంటూ పాక్ తన బలహీనతను మరింతగా బహిర్గటిస్తోంది. ఇలాంటి తప్పిదాలు పదే పదే చేస్తూ దేశాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోని నెడుతోంది.