Homeఅంతర్జాతీయంDonald Trump: కెనడా దేశాన్ని విడగొట్టే పెద్ద ప్లాన్‌ వేసిన డోనాల్డ్‌ ట్రంప్‌... అసమ్మతి దారులతో...

Donald Trump: కెనడా దేశాన్ని విడగొట్టే పెద్ద ప్లాన్‌ వేసిన డోనాల్డ్‌ ట్రంప్‌… అసమ్మతి దారులతో భేటీ

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దృష్టి మొదట వెనెజువెలా, ఇరాన్, గ్రీన్‌లాండ్‌పై పడింది. ఇప్పుడు కెనడా ప్రావిన్స్‌ అల్బెర్టాపై పడింది. ఆయిల్, గ్యాస్, మినరల్స్‌ సంపద కలిగిన ఈ ప్రావిన్స్‌కు చెందిన సుమారు 30% మంది తమకు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ అధికారులతో అల్బెర్టా నేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. మరోసారి సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఇక అమెరికా మంత్రి కూడా ‘అక్కడి సంపద అక్కడి ప్రజలకు చేరాలి‘ అంటూ మద్దతు పలికారు. ఇది […]

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దృష్టి మొదట వెనెజువెలా, ఇరాన్, గ్రీన్‌లాండ్‌పై పడింది. ఇప్పుడు కెనడా ప్రావిన్స్‌ అల్బెర్టాపై పడింది. ఆయిల్, గ్యాస్, మినరల్స్‌ సంపద కలిగిన ఈ ప్రావిన్స్‌కు చెందిన సుమారు 30% మంది తమకు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ అధికారులతో అల్బెర్టా నేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. మరోసారి సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఇక అమెరికా మంత్రి కూడా ‘అక్కడి సంపద అక్కడి ప్రజలకు చేరాలి‘ అంటూ మద్దతు పలికారు. ఇది కెనడాను విడగొట్టే పెద్ద ప్లాన్‌లా కనిపిస్తోంది.

గ్రీన్‌లాండ్‌ తరహాలో ఆక్రమణకు..
ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నించగా, యూరోపియన్‌ యూనియన్‌ ఖండించింది. 1946లో కూడా అమెరికా ఇలాంటి ప్రయత్నం చేసింది. అలాస్కా కొన్న తర్వాత దాని దృష్టి పడింది. ట్రంప్‌ ఎందుకు వెనక్కి తగ్గారు. నాటో మిత్రదేశాలపై టారిఫ్‌ బెదిరింపులు వేసి, చర్చలకు దారి తీశారు. అల్బెర్టాలో కొనుగోలు ప్రతిపాదన లేనప్పటికీ, విభజన మద్దతు ఇదే వ్యూహాన్ని పునరావృతం చేస్తోంది. కెనడా ప్రధాని ట్రంప్‌ 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామన్న మాటలను ఇప్పుడు అల్బెర్టా విభజనగా మార్చారు.

అల్బెర్టా ప్రజల ఆకాంక్ష..
కెనడాలోనే ధనవంతమైన అల్బెర్టా, ఆయిల్‌ సంపదను ఒట్టవా పాలనలో కోల్పోతోందని ఆరోపిస్తోంది. ప్రజలు తమ వనరులను స్వయం వాడుకోవాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ మద్దతు దీన్ని బలపరుస్తోంది. కానీ ఇది కెనడా ఐక్యతకు ఆధారాన్ని దెబ్బతీస్తుంది. గతంలో కెనడా ఖలిస్తాన్‌ వంటి విభజనలకు మద్దతు ఇచ్చినా, ఇప్పుడు తనలోనే అదే బాధ మొదలవుతోంది.

ప్రపంచపై ప్రభావం..
ట్రంప్‌ ఉక్రెయిన్‌ విషయంలో రష్యాకు మొగ్గు చూపుతున్నారు. పాకిస్తాన్‌ కశ్మీర్‌ అడిగితే ఇచ్చేస్తామన్నట్లు సిగ్నల్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. లిబియా, యెమెన్‌లా దేశాలు ఇప్పటికే ముక్కలయ్యాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. దేశాలను విడగొట్టడం అన్యాయం. ట్రంప్‌ వ్యూహం అమెరికా ఆధిపత్యాన్ని పెంచుతూ, ప్రపంచ ఐక్యతను బలహీనపరుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper