Homeఎంటర్టైన్మెంట్Prabhas Fauji Movie Release Date: పోరాట సన్నివేశాల కోసం 100 రోజుల షూటింగ్..ప్రభాస్ 'ఫౌజీ'...

Prabhas Fauji Movie Release Date: పోరాట సన్నివేశాల కోసం 100 రోజుల షూటింగ్..ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Prabhas Fauji Movie Release Date: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఫౌజీ'(Fauji Movie). ‘సీతా రామం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది కూడా హను రాఘవుడి మార్క్ లవ్ స్టోరీ నే. ప్రభాస్ కి ఉన్నటువంటి యాక్షన్ హీరో ఇమేజ్ కి లవ్ స్టోరీలు సరిపడవు, ఒకవేళ చేస్తే డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది ‘రాధే శ్యామ్’ తో […]

Prabhas Fauji Movie Release Date: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఫౌజీ'(Fauji Movie). ‘సీతా రామం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది కూడా హను రాఘవుడి మార్క్ లవ్ స్టోరీ నే. ప్రభాస్ కి ఉన్నటువంటి యాక్షన్ హీరో ఇమేజ్ కి లవ్ స్టోరీలు సరిపడవు, ఒకవేళ చేస్తే డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది ‘రాధే శ్యామ్’ తో ఒకసారి నిరూపితమైంది. పైగా హను రాఘవపూడి ప్రేమ కథలు నోవెల్ స్టైల్ లో చాలా సున్నితంగా ఉంటాయి, ప్రభాస్ కి ఇలాంటివి ఎక్కడ వర్కౌట్ అవుతుంది?, ఈ సినిమా హిట్ అవ్వడం అసాధ్యం అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. అయితే ఇది పూర్తి స్థాయి లవ్ స్టోరీ కాదు, ఇది ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా, గూస్ బంప్స్ రప్పించే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి.

ఈ యాక్షన్ సన్నివేశాల కోసం 100 రోజుల సమయం తీసుకోబోతున్నాడట డైరెక్టర్ హను రాఘవపూడి. లవ్ స్టోరీ అంటున్నారు, యాక్షన్ మూవీ తరహా లో యాక్షన్ సన్నివేశాల కోసం ఇన్ని రోజుల సమయం తీసుకోవడం ఏంటో అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందట. కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే మిగిలింది. అందుకోసం 100 రోజుల సమయం తీసుకొని, రెండు యూనిట్స్ గా మారి తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఈ దసరా కి ఎలా అయినా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలి అనేదే టార్గెట్. అందుకే రెండవ యూనిట్ ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రెండవ యూనిట్ ని పెట్టినా కూడా 100 రోజుల సమయం పడుతుంది అంటున్నారు అంటే, ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మీరే ఊహించుకోండి.

ప్రభాస్ ఫ్యాన్స్ ‘రాజా సాబ్ ‘ ఫ్లాప్ తో పూర్తి స్థాయి నిరాశలో ఉన్నారు. ప్రతీ రోజు డైరెక్టర్ మారుతి ని ట్యాగ్ చేసి తిట్టడమే వాళ్లకు దినచర్య లాగా మారిపోయింది. ‘స్పిరిట్’ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి, కానీ ఆ సినిమా కోసం ఏడాది వరకు ఎదురు చూడాలి. అంత ఓపిక లేదు, ఈ దసరా కి ‘ఫౌజీ’ విడుదల అయితే ఈ చిత్రం తో అయినా ‘రాజా సాబ్’ చేసిన గాయాన్ని కవర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రజాకార్ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒక భారతీయ సైనికుడికి, పాకిస్తానీ యువతీ కి మధ్య జరిగిన ఒక ప్రేమ కథ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వర్కౌట్ అయితే మరో వెయ్యి కోట్ల గ్రాస్ అవలీల గా వచ్చి చేరుతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper