Homeట్రెండింగ్ న్యూస్Uttar Pradesh: నడి రోడ్డుపై మహిళల సిగపట్లు.. వీడియో వైరల్‌!

Uttar Pradesh: నడి రోడ్డుపై మహిళల సిగపట్లు.. వీడియో వైరల్‌!

Uttar Pradesh: రెండు జుట్లు కలిసి ఉంటాయి.. కానీ.. రెండు సిఖలు కలిసి ఉండవు అనేది నానుడి.. గతంలో వీధుల్లో నల్లాల వద్ద మహిళల సిగపట్ల దృశ్యాలు, బిందెలతో కొట్టుకునే ఫైట్లు కనిపించేవి. ఇళ్లు, వాకిలి, రోడ్డు అని చూడకుండా పొట్టు పొట్టు తన్నుకుంటారు. ఉన్న పరువును బజారున పడేసుకుంటారు. ఆ సమయంలో ఎవరున్నా అనవసరం. వీరి మధ్యకు వెళ్లిన వాళ్లు కూడా వీరి దాష్టీకానికి బలౌతుంటారు. ఇక ఇరుగింటి, పొరిగింటి సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఇద్దరు ఆడవాళ్ల మధ్య చిచ్చు రేగిందా.. ఇక అంతే సంగతి.

వీటిని చూసే ఆ నానుడు వచ్చినట్లు ఉంది. అయితే ఇప్పుడు అలాంటి కొట్లాటలు చాలా వరకు తగ్గిపోయాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి దృశ్యం ఒకటి సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ మహిళలు కొట్టుకున్నది నీళ్ల కోసం కాదు.

యూపీలో ఘటన..
చిన్న విషయంలో మాటామాటా పెరిగి ఇద్దరు ఆడవాళ్లు రోడ్డుపై సిగ పట్టు పట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో జరిగింది. సచెండి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హృద్పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు.. ఇరుగు పొరుగున జీవిస్తున్నారు. అయితే ఓ విషయంపై వీరిద్దరి మధ్య తగాదా మొదలైంది. మాటామాట పెరిగి చేతల వరకు వచ్చాయి. ఇక రోడ్డు మీద ముష్టి యుద్ధం స్టార్‌ చేసేశారు. ఒంటిపై దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా.. జుట్లు పట్టుకుని రోడ్డుపై పడిపోయి మరీ దాడి చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు ఓ పురుషుడు ప్రయత్నించినప్పటికీ.. మళ్లీ కొట్టుకున్నారు. మరికొంత మంది మహిళలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు.

ఇటీవలే మహిళా ఉపాధ్యాయులు..
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోనే ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కూడా ఇలాగే తన్నుకున్నారు. ఇగోకు పోయిన ఇద్దరూ.. పాత విషయాలను గుర్తుచేసుకుంటూ మరీ కొట్టుకున్నారు. కిందపడి దొర్లారు కూడా. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే.. విద్యార్థుల ముందే కొట్టుకోవడం సంచలనంగా మారింది. తాజాగా ఇరుగు పొరుగు మహిళలు రోడ్డుపై సిగపట్టు పట్టారు. ఈ ఘటనలు చూస్తుంటే రెండు సిఖలు కలిసి ఉండవు అనే నానుడి నిజమే అనిపిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper