Suchi leaks Dhanush and Anirudh : 2017లో సుచి లీక్స్ కోలీవుడ్ ని కుదిపేశాయి. సింగర్ సుచిత్ర కార్తీక్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ చీకటి బాగోతం అంటూ… ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ లు త్రిష, ఆండ్రీయాలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు. ఈ సుచి లీక్స్ వ్యవహారంలో రానా దగ్గుబాటి కూడా బుక్ అయ్యాడు. హీరోయిన్ త్రిషతో క్లోజ్ గా ఉన్న ఆయన ప్రైవేట్ ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే మరికొందరు కోలీవుడ్ హీరోయిన్స్, దర్శకుల బాగోతాలు సుచీ లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర విడుదల చేశారు.

తనకు మద్యం తాగించి ధనుష్, అనిరుధ్ లైంగికంగా వాడుకున్నారని సుచిత్ర ఆరోపణలు చేశారు. సింగర్ చిన్మయిపై కూడా సుచిత్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇది జరిగి చాలా కాలం అవుతుండగా మళ్ళీ తెరపైకి వచ్చింది. సుచి లీక్స్ తరహాలో ధనుష్, అనిరుధ్, ధన్య బాలకృష్ణ బాగోతాలు బయటపెడతాను అంటుంది కల్పిక గణేష్. ధన్య బాలకృష్ణ-కల్పిక గణేష్ మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది. కోలీవుడ్ దర్శకుడితో ధన్య బాలకృష్ణ రహస్య సహజీవనం చేస్తున్నట్లు కల్పిక వెల్లడించారు.
కల్పిక ఆరోపణలకు ధన్య బాలకృష్ణ కౌంటర్లు ఇచ్చారు. ఇటీవల కోలీవుడ్ లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ కి కల్పిక ఆహ్వానం లేకుండానే హాజరయ్యారు. దీని గురించి మాట్లాడుతూ… అవార్డుల వేడుకకు నన్నెవరూ పిలవలేదు. పరిశ్రమను కుటుంబంలా భావించి నేను వెళ్ళాను. ఇక ట్రోల్ చేసేవారు చేస్తూనే ఉంటారు. జనాలకు నిజాలు తెలియాలంటే కొందరి నిజస్వరూపాలు బయటపెట్టాలి. త్వరలో ధనుష్, అనిరుధ్ రవిచంద్రన్, ధన్య బాలకృష్ణల చీకటి జీవితాలు బయటపెడతాను, అని అన్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ప్రయాణం చిత్రంతో కల్పికా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. హీరోయిన్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ ఆమెకు దక్కింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడి పడి లేచే మనసు, హిట్ చిత్రాల్లో కల్పిక గణేష్ నటించారు. లేటెస్ట్ హిట్ యశోద చిత్రంలో కల్పిక కీలక రోల్ చేశారు. ఆమె కూడా సమంత మాదిరి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు కల్పిక గణేష్ ఇటీవల వెల్లడించారు.