
Rashmika Mandanna: స్టార్ లేడీ రష్మిక మందాన షేర్ చేసిన ఓ ఫోటో ఆమె పరువు తీసింది. అనుకోకుండా ఆమె నెటిజెన్స్ కి దొరికిపోయారు. కొందరు నెటిజెన్స్ రష్మిక ఫోటో జూమ్ చేసి చూసి ఒక జుగుప్సాకరమైన విషయాన్ని కనుగొన్నారు. దాన్ని నలుగురితో పంచుకున్నారు. ఈ మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘నాకు పెదాలతో గుచ్చడం రాదు. అందుకే స్ట్రెయిట్ కిస్’ అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ఆ కామెంట్ కి ముద్దు పెడుతున్న ఫోటో జోడించారు. ఐ ఫోన్ సెల్ఫీ కావడంతో పిక్చర్ పిచ్చ క్లారిటీతో వచ్చింది. దీంతో ఆమె ముఖంలోని డిటైల్స్ మొత్తం క్యాప్చర్ అయ్యాయి.
ఆ ఫోటో సోషల్ మీడియా జనాలను ఆకర్షించింది. రష్మిక ఫోటోని డౌన్ లోడ్ చేసి జూమ్ చేసి మరీ చూశారు. ఆమె ముఖం మీద అవాంఛిత రోమాలు కనిపించడంతో ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. రష్మికకు గడ్డం ఉంది చూడండి అంటూ టమకా వేస్తున్నారు. కామెంట్స్ సెక్షన్ లో జూమ్ చేసి కట్ చేసిన ఫోటో పెడుతున్నారు. రష్మిక అనవసరంగా ఇరుక్కుపోయానని ఫీల్ అవుతున్నారు. షూటింగ్స్ లో బిజీగా ఉన్న కారణంగా రష్మిక ఇలాంటి చిన్న చిన్న విషయాలు విస్మరిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియా యుగంలో సిల్లీ థింగ్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాగా రష్మిక రెండు బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ ల పాన్ ఇండియా మూవీ పుష్ప 2 చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలకు మించి ఉంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు.
అలాగే రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. యానిమల్ ఈ ఏడాది విడుదల కానుంది. ఇటీవల మరో రెండు చిత్రాలు ప్రకటించింది. నితిన్ కి జంటగా వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. రైన్ బో టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు.