
ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ నీలికళ్ల సుందరి స్నేహా ఉల్లాల్. అచ్చం ఐశ్వర్యరాయ్ లా ఉండే ఈమెకు మొదట్లో మంచి అవకాశాలే వచ్చాయి. సింహా చిత్రంలో బాలయ్య సరసన ఆడిపాడింది.
ఇక ఇక్కడ అవకాశాలు తగ్గడంతో హిందీలోకి వెళ్లింది. ‘లక్కీ నో టైం ఫర్ లవ్’ చిత్రం ద్వారా అక్కడ గుర్తింపు పొందింది. ఐశ్వర్యరాయ్ లా కనిపించడంతో మొదట్లో అవకాశాలు వచ్చినా ఆ తర్వాత పెద్దగా కలిసి రాలేదు.
తెలుగులో ‘నేను మీకు తెలుసా’ చిత్రంతోపాటు నాగార్జున సరసన ‘కింగ్’లోనూ ఓ ఐటెం సాంగ్ చేసింది. అయితే బాక్సాఫీసు వద్ద ఆమె సినిమాలు ఆడక పోవడంతో ఇక చాలించుకుంది.
ప్రస్తుతం ఫొటోషూట్ లు, ఇన్ స్టాగ్రామ్ లో ఘాటు ఫొటోలతో అలరిస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడే బాత్ రూం నుంచి స్నానం చేసి టవల్ తో వచ్చిన ఫొటోను షేర్ చేసింది. చంద్రుడిలా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
https://www.instagram.com/p/COIBAWCB7rG/?utm_source=ig_web_copy_link