
మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావ్ (88) చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎం. ఎస్. ఆర్ నిమ్స్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అంత్యక్రియాలు జరుగనున్నాయి.