Homeట్రెండింగ్ న్యూస్Illegal Affair : ఆమెకు ఇద్దరు.. పగలు ప్రియుడు, రాత్రి మొగుడు..!?

Illegal Affair : ఆమెకు ఇద్దరు.. పగలు ప్రియుడు, రాత్రి మొగుడు..!?

Illegal Affair : వివాహేతర సంబంధాలు సంపారాలను కుప్ప కూలుస్తున్నాయి.. మహిళ అయినా.. పరుషుడు అయినా వారు వేసే తప్పటడుగు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం తీస్తున్నాయి. చెన్నైలో ఓ వివాహిత వేసిన తప్పటడుగు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. భర్త ఊరిలో నివాసం ఉంటున్న యువకుడితో పరిచయం పెంచుకున్న భార్య అతనితో రొమాన్స్‌ చేసింది. పగలు ప్రియుడు, రాత్రి లైసెన్స్‌ ఇచ్చిన మొగుడు అంటూ ఆమె ఇద్దరితో ఎంజాయ్‌ చేసింది. అయితే ఈ వ్యవహారం ఎంతో కాలం సాగలేదు.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో భార్య అసలు బండారం బయటపడింది. మ్యాటర్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది.

చెంగల్‌పట్టు జిల్లాలో..
తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పౌంజూరు సమీపంలోని నెల్వాయిపాలేంలో వివేక్‌ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన జగదీశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివేక్, జగదీశ్వరి దంపతులు చాలా సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్య జగదీశ్వరి, ఇద్దరు పిల్లలతో కలిసి వివేక్‌ గత ఏడాది వరకు చాలా సంతోషంగా జీవించాడు.

భర్తలేని సమయంలో ఇంటికి వస్తూ..
వివేక్‌ నివాసం ఉంటున్న గ్రామంలోనే ఏకాంబరం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం జగదీశ్వరికి దగ్గర అయ్యాడు. వివేక్‌ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెళ్లి వస్తున్న ఏకాంబరం జగదీశ్వరిని వలలో వేసుకున్నాడు. రానురాను సరసాలు ఆడుతున్న జగదీశ్వరి, ఏకాంబరం అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్‌ చేశారు. ఊరి బయట తరచూ ఏకాంతంగా కలుసుకుని పిచ్చపాటిగా జల్సాలు చేశారు. రెండు నెలల క్రితం భార్య జగదీశ్వరి అక్రమ సంబంధం విషయం భర్త వివేక్‌ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోకపోతే నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు.

భర్త నైట్‌ షిఫ్ట్‌.. భార్య ఇంకో షిఫ్ట్‌..
భర్త హెచ్చరించినా జగదీశ్వరి తన తీరు మార్చుకోలేదు. ప్రియుడి మోజులో ఆమె ఏకాంబరంతో మాట్లాడుతూనే ఉందని, అతన్ని కలుస్తూనే ఉందని తెలిసింది. సోమవారం ఉదయం వివేక్‌ తన ఇంట్లో శవమై కనిపించాడు. ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చిన తన భర్త వివేక్‌ నిద్రలోనే చనిపోయాడని జగదీశ్వరి గ్రామస్తులు, బంధువులకు సమాచారం అందించి బోరున విలపించింది. వివేక్‌ మృతిపై అనుమానం వచ్చిన అతని తండ్రి కుప్పన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వివేక్‌ శవాన్ని పోస్టుమార్టుం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో వివేక్‌ గొంతు నులిమి చంపేశారని వెలుగు చూసింది. పోలీసులు జగదీశ్వరిని అదుపులోకి తీసుకుని బెండ్‌ తీస్తే అసలు మ్యాటర్‌ బయటకు వచ్చింది.

అడ్డు తొలగించుకోవాలనే..
తన అక్రమ సంబంధానికి తన భర్త వివేక్‌ అడ్డుపడుతున్నాడని, అందుకే అర్దరాత్రి ప్రియుడు ఏకాంబరంతో కలిసి మద్యం మత్తులో ఉన్న వివేక్‌ గొంతు నులిమి చంపేశామని జగదీశ్వరి అంగీకరించింది. అక్రమ సంబంధం కారణంగా భర్త వివేక్‌ను హత్య చేసిన జగదీశ్వరి, ఆమె ప్రియుడు ఏకాంబరంను అరెస్టు చేశామని చెంగల్పట్టు పోలీసులు తెలిపారు. తండ్రి మరణం.. తల్లి జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular