Married women have affairs: వివాహ బంధం ప్రేమ, నమ్మకంతో ముడిపడి ఉండాలి. వివాహం అయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ కంటిన్యూ అవ్వాలి. ఆ ప్రేమ కంటిన్యూ అవుతుంది కానీ చూపించడానికి సమయం ఉండదు.కానీ కొంతమంది జంటల మధ్య ప్రేమ ఉండటం లేదు. కనిపించడం లేదు. అందుకే వివాహేతర సంబంధాలు ఎక్కువగా ప్రారంభమవుతున్నాయి. అయితే చాలా మంది వివాహేతర సంబంధాలు పురుషులే పెట్టుకుంటారు అనుకుంటారు కానీ. మహిళలు కూడా అదే పని చేస్తున్నారు.
వివాహేతర సంబంధం ఏ వైవాహిక జీవితాన్ని అయినా , ఎంత చక్కటి జీవితాన్ని అయినా నాశనం చేస్తుంది. వివాహేతర సంబంధం భార్యాభర్తల సంబంధంలో తుఫాను లాంటిది. వివాహేతర సంబంధం పిల్లల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వివాహం తర్వాత మహిళలు తమ హృదయాన్ని మరొక పురుషుడికి ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. ఈ కారణాలే వాల్లను ఎక్కువ ప్రేరేపిస్తాయట.
భావోద్వేగ మద్దతు
వివాహం తర్వాత స్త్రీలు వివాహేతర సంబంధాలు కలిగి ఉండటానికి ఒక కారణం భావోద్వేగ మద్దతే అంటున్నారు నిపుణులు. తమ ఫీలింగ్స్, భావాలను చెప్పడానికి, పంచుకోవడానికి పార్టనర్ దగ్గర ఉండకపోవడం, సమయానికి స్పందించకపోవడం వంటివి ప్రధాన కారణమట. ఇలాంటి సందర్భంలో మహిళలు భావోద్వేగ మద్దతు కోసం ఇతర పురుషుల వైపు ఆకర్షితులవుతారు. మొదట్లో వారు ఒకరితో ఒకరు మాట్లాడి మంచి స్నేహితుడిగా మాత్రమే అనుకుంటారు. కానీ కాలక్రమేణా స్నేహం ప్రేమ వ్యవహారంగా మారుతుంది. తప్పుడు రిలేషన్ గా ప్రూఫ్ అవుతుంది.
Also Read: ధనవంతుల లాగా నటిస్తున్న మిడిల్ క్లాస్ పీపుల్స్.. ఏం జరగనుందో తెలుసా?
సమయం లేకపోవడం
పెళ్లైన చాలా సంవత్సరాల తర్వాత, భర్త ఇంటి బాధ్యతల్లో, పిల్లల బాధ్యతల్లో మునిగిపోతాడు. అలాంటి పరిస్థితిలో, భర్త మునుపటిలాగా ప్రేమగా ఉండడు. ఉండలేడు. చాలాసార్లు అతను తన భార్యకు సమయం ఇవ్వలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో, స్త్రీలు ఇతర పురుషుల వైపు ఆకర్షితులవుతారు.
సంతృప్తి లేకపోవడం
40 ఏళ్ల తర్వాత స్త్రీలు వివాహేతర సంబంధాలను కొనసాగించడానికి ఒక కారణం సంతృప్తి లేకపోవడం కావచ్చు అంటున్నారు నిపుణులు. భర్త నుంచి శారీరక ఆనందం, మానసిక ఆనందం లేక మహిళలు ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారట.
Also Read: నీ జీవితం మారాలని అనుకుంటున్నావా? అయితే కష్టాన్ని కోరుకో..
రోజువారీ బాధ
ఇంట్లో రోజూ జరిగే గొడవలు భార్యాభర్తల మధ్య ప్రేమను తగ్గిస్తాయి. ఇది వివాహేతర సంబంధం ఏర్పడటానికి ఒక పెద్ద కారణం కావచ్చు. గృహ సమస్యల కారణంగా మహిళలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడిని అధిగమించడానికి వారు ఇంటి బయట ప్రేమ కోసం వెతుకుతుంటారు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.