Divorce Celebration: అందరివీ సుఖసంసారాలు అయితే ఆ వాడ, గ్రామాలన్నీ పచ్చగా ఉంటాయి. కానీ కొందరివి మాత్రం కాదు.. కొందరు వ్యక్తుల భార్యల టార్చర్ మామూలుగా ఉండదు. నరకంలా ఉంటుంది. భార్య బాధితుల గోడు ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది.. వీరికి విముక్తి కల్పించడానికి ‘భార్యా బాధితుల సంఘాలు’ పుట్టుకొచ్చాయి. కోర్టుకు వెళ్లి మరీ వారి తరుఫున సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి వారిని ‘భార్యల’ నుంచి విముక్తి కల్పిస్తున్నాయి. అనంతరం విడాకుల పార్టీలను గ్రాండ్ చేస్తున్నాయి.

ఈ పెళ్లాలు మాకొద్దు బాబోయ్ అంటూ ప్రాధేయపడే మగాళ్లు మన సభ్య సమాజంలో ఎందరో ఉన్నారు. తమకు ఒంటరి జీవితమే మేలు జంటగా బతుకు వద్దని మరీ మొత్తుకున్నారు. న్యాయస్థానం వారి గోడును పట్టించుకుంది. వారు చెప్పుకున్న బాధను ఆలకించి వారికి విడాకులు మంజూరు చేయడంతో ఓ స్వచ్చంధ సంస్థ దీన్ని వేడుకలా నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో దీనికి సంబంధించిన క్రతువు ప్రారంభించడంతో అందరు అవాక్కవుతున్నారు. విడాకులను కూడా వేడుకలా నిర్వహించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఏమవుతుందో వేచి చూడాల్సిందే.
ఆలుమగల మధ్య అనుబంధం అందరికి తెలుసు. వారి ప్రేమ కడదాకా నిలిచి ఉంటుంది. జీవిత భాగస్వామినే నమ్ముకుని కడదాకా తోడుండే వారు ఉన్నారు. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయే వారు ఉండటం చూస్తుంటాం. భార్యాభర్తల బంధం గురించి పాశ్చాత్యులు ఎంతో ముచ్చట పడుతుంటారు. మన వివాహ వ్యవస్థ తీరుతెన్నులకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. వివాహంతోనే ఒక ఆడ, మగ జీవితాంతం కలిసుండే మహత్తర కార్యానికి ఫిదా అయిపోతుంటారు. కానీ మన వివాహ వ్యవస్థ రానురాను నాగరికత పేరుతో విచ్చలవిడితనం పెరుగుతోంది. నూతన పోకడలతో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే వారు చాలా మంది ఉంటున్నారు.
సంసారంలో భార్యాభర్తలకు అన్యోన్యత ఉండాలే కానీ వందేళ్లు ఏంటి వెయ్యేళ్లయినా కాపురం చేస్తారు. కానీ అభిప్రాయ భేదాలు వస్తే ఇక అంతే. సంసారంలో కలతలు మొదలైతే సముద్రంలో అలలు వచ్చినట్లే. మాటామాటా పెరిగితే గొడవలే అవుతాయి. చాలా మంది భార్యలు భర్తల మాటలు విన్నా కొందరు మాత్రం భర్తలను అసలు లెక్కలోకే తీసుకోరు. దీంతో వారంతా భార్యా బాధితులుగా భావించుకుని పెళ్లాం చెప్పినట్లు వినాల్సిందేనని కుమిలిపోతుంటుంటారు. కానీ ఎన్నాళ్లని ఓర్పుతో ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు తెగిస్తే ఇక సంసారం పటాపంచలే. అనుబంధం కాస్త తెగిపోతుంది. ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు.

తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కొందరు భార్యా బాధితులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. దీంతో వారిని భాయ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి అండగా నిలుస్తోంది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత వారికి విడాకులు మంజూరు కావడంతో వారికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చేందుకు సంస్థ ముందుకొచ్చింది. దీనికి గాను ఆహ్వాన పత్రికలు కూడా కొట్టించడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 18న వీరి కోసం ఎంతో ఉన్నతంగా పార్టీ ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది.
దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భార్యలను వదిలేసిన 18 మందికి ఈ సంస్థ అక్కున చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. భార్యలు పెడుతున్న వేధింపులతోనే వారు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. జీవితాంతం ఊడిగం చేసే సహనం లేకే స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో వారు భార్యలను వదిలేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇందులో స్వచ్చంధ సంస్థ చేస్తున్న కృషికి అందరు ఫిదా అవుతున్నారు. వేడుకల్లో వారి కోసం ఇంకా ఏం ట్విస్ట్ లు ఇస్తారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. పెళ్లి మాదిరిగానే విడాకులను కూడా వేడుకలా నిర్వహించడంతో అందరిలో ఆతృత నెలకొంది.
[…] […]