SIIMA 2022- Pushpa: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులను కూడా బాగా మెప్పించింది. ఇప్పుడు అవార్డుల రూపంలో కూడా రికార్డుల సృష్టిచింది. దక్షిణాదిలోనే ప్రిస్టేజియస్ అవార్డ్స్ లో సైమా అవార్డ్స్ ఒకటి. ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే ఈ అవార్డుల వేడుక ఈసారి కూడా బెంగళూరులో ఘనంగా జరిగింది. అయితే, సైమా అవార్డ్స్ లో పుష్ప విజయకేతనం ఎగరవేసింది.

వివిధ కేటగిరీలలో పుష్పకి అవార్డుల పంట పడింది. మరి మొత్తం ఈ అవార్డుల లిస్ట్ లో పుష్ప సాధించిన అవార్డులను గమనిస్తే..
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప : ది రైజ్)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప : ది రైజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప : ది రైజ్)
ఉత్తమ చిత్రం: పుష్ప: ది రైజ్ (మైత్రి మూవీ మేకర్స్)
ఉత్తమ సాహిత్య రచయిత : చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప : ది రైజ్)
ఉత్తమ సహాయ నటుడు : జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప : ది రైజ్)
మొత్తానికి ‘పుష్ప’ రికార్డుల ప్రభంజనమే కాదు, అవార్డుల ప్రభంజనం కూడా సృష్టించింది. మొత్తం ఆరు అవార్డులను దక్కించుకుంది. ఇక బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ‘సైమా’ వేడుకల్లో రెండోసారి అవార్డు అందుకున్నారు.

ఇక తెలుగు చిత్రసీమలో మిగిలిన నటీనటులకు అలాగే సినిమాలకు అదే విధంగా సాంకేతిక బృందానికి వచ్చిన అవార్డులను ఒకసారి పరిశీలిస్తే..
ఉత్తమ నటి : పూజా హెడ్గే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)
ఉత్తమ సహాయ నటి : వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : రామ్ మిరియాల (చిట్టి – జాతి రత్నాలు)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు : బుచ్చి బాబు సానా (ఉప్పెన)
ఉత్తమ తొలి నిర్మాత : సతీష్ వేగేశ్న (నాంధి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సి రామ్ ప్రసాద్ (అఖండ)
ఉత్తమ డెబ్యూ హీరో : పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ డెబ్యూ హీరోయిన్ : కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ నేపథ్య గాయని : గీతా మాధురి (జై బాలయ్య – అఖండ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్) : నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)
ఉత్తమ హాస్యనటుడు : సుదర్శన్ (ఏక్ మినీ కథ) లకు అవార్డులు వచ్చాయి.
Also Read:Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. భారీ స్కెచ్.. ఇలా లీక్
[…] Also Read: SIIMA 2022- Pushpa: పుష్పకి అవార్డుల పంట.. సరికొత్… […]