
IAS vs IPS: సిరియాలో భూకంపం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ వెళ్ళాడు.. కాశ్మీర్లో లిథియం నిల్వలు వెలుగులోకి వచ్చాయి. కానీ వీటిని నెటిజన్లు పట్టించుకోవడం లేదు. పైగా లైట్ తీసుకున్నారు. ఎంతైనా రసిక హృదయులు కదా…ఓ అధికారి ప్రైవేట్ ఫోటోల కోసం గూగుల్ తల్లిని తెగ విసిగించేస్తున్నారు. ఇంతకీ ఏమిటయ్యా ఆ కథ అంటే.. కర్ణాటక తెలుసు కదా! మన పొరుగునే ఉంటుంది. అక్కడ రోహిణి సింధూరి, రూప అనే అధికారులు కొట్లాడుకుంటున్నారు.. ఒకరి లోపాలు మరొకరు ఎండగట్టుకుంటున్నారు..అందులో భాగంగా వెలుగులోకి వచ్చిందే రోహిణి సింధూరి ప్రైవేట్ ఫోటోల వ్యవహారం.
మగ అధికారులకు పంపించిందట
ఐపీఎస్ అధికారి రూప కొన్ని రోహిణి ఫోటోలను రిలీజ్ చేసింది.. అవన్నీ కూడా రోహిణి మగ అధికారులకు పంపించిందని ఆరోపించింది.. చాలా అసభ్యకరమైన ఫోటోలు అని ఒక సెక్షన్ మీడియా రాస్తోంది. వాటన్నింటినీ కూడా నేను సోషల్ మీడియాలో ఎప్పుడో పోస్ట్ చేశాను, ఇలా నా మీద బురద చల్లేందుకు వాడుకోవడం దారుణమని రోహిణి సింధూరి ఆరోపిస్తోంది.. అంతేకాదు చీఫ్ సెక్రటరీకి ఐపీఎస్ రూప మీద ఫిర్యాదు కూడా చేసింది. వీరిద్దరి వ్యవహారం చికాకు తెప్పిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఇద్దరిని వారి వారి పోస్టుల నుంచి పీకి పడేసింది.. ఏకంగా వేకెన్సీ రిజర్వ్ లో ఉంచింది. నిజానికి ఈ ఇద్దరు మహిళ అధికారుల మధ్య రెండు సంవత్సరాలుగా వైరం కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా ఫోటోల షేరింగ్ దాకా వచ్చింది. మొదట్లో ఇద్దరికీ మంచి పేరు ఉండేది. ఈ వ్యక్తిగత ఈగోల వల్ల భ్రష్టు పట్టిపోయారు.. రోహిణి సింధూరి పేరు డీకే రవి అనే అత్యంత నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కేసులో ప్రైవేట్ గా వినిపించింది.. ఈ కేసును సిబిఐ దర్యాప్తు కూడా చేసింది.. ఇక రవి భార్య కుసుమ చివరికి ఎవరి పాపాన వాళ్లే పోతారు అని ట్రీట్ చేసి వదిలేసింది.
అది ఎవరూ పట్టించుకోవడం లేదు
ఇక రోహిణి సింధూరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిని నెటిజన్లు పట్టించుకోవడం లేదు. కేవలం ఆమె ప్రైవేట్ ఫోటోల కోసం తెగ వెతుకుతున్నారు.. ఇక రోహిణి వివాదాస్పద కెరియర్లో ఇప్పటిలాగే మరో మహిళా అధికారితో గొడవ పడింది. ఆ అధికారి పేరు శిల్ప నాగ్. రోహిణి 2009 బ్యాచ్, శిల్ప 2014 బ్యాచ్. ఇద్దరు కూడా వీధి కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టు గా వ్యవహరించడంతో అప్పుడు కూడా ప్రభుత్వం ఇద్దరినీ తమ పోస్టుల నుంచి బదిలీ చేసింది.. మరీ ఇప్పటి బిజెపి ప్రభుత్వం లాగా వేకెన్సీ రిజర్వ్ లో మాత్రం ఉంచలేదు. రోహిణి సింధూరి తెలుగు మహిళ. తెలుగు వ్యక్తినే పెళ్లి చేసుకుంది. కొలువులో చేరిన కొత్తలో మంచి పేరే సంపాదించింది. కానీ తర్వాత అన్నీ వివాదాలే. మైసూర్ డిప్యూటీ కమిషనర్ గా పని చేసినప్పుడు తన అధికారిక నివాసంలో స్విమ్మింగ్ పూల్, జిమ్ నిర్మించుకుంది. అది కూడా కరోనా కాలంలో. 50 లక్షలు కూడా ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టింది.. ఇటలీ నుంచి ఫర్నిచర్ తెప్పించుకుని పన్ను ఎగ్గొట్టింది.
సొంతం కాదు కదా!
ప్రభుత్వం ఇచ్చే అధికారిక నివాసం తన సొంతం కాదు కదా! ఈ విషయాన్ని రోహిణి పూర్తిగా మర్చిపోయింది. ఇక ఇదే ఖర్చును మైసూర్ కార్పొరేషన్ కమిషనర్ శిల్ప వ్యతిరేకించింది. అది చారిత్రక కట్టడం కాబట్టి నిబంధనలకు విరుద్ధమని వాదించింది. దీంతో రోహిణి ఈగో దెబ్బ తిన్నది. శిల్పను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. శిల్ప మీద కోపాన్ని కార్పొరేషన్ అధికారుల మీద చూపించింది. శిల్పకు ఇది చిరాకు తెప్పించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని బజారుకెక్కింది.. దీంతో 64 మంది మైసూర్ కార్పొరేటర్లు శిల్పకు మద్దతుగా నిలిచారు. రోహిణి మీద చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. ప్రభుత్వానికి ఇది తలనొప్పి కావడంతో ఇద్దరు శాఖలను మార్చారు. ఇద్దరు మహిళల మధ్య సయోధ్య అనేది ఎప్పుడూ ఒక బ్రహ్మ పదార్థమే.
బహిరంగం చేయాల్సిన అవసరం ఏమిటి
రోహిణి ప్రైవేట్ ఫోటోలను మగ అధికారులకు పంపిస్తే, వాటిని బహిరంగం చేయాల్సిన అవసరం రూపకు ఏమిటి? అదంతా కూడా ఆమె ప్రైవేట్ వ్యవహారం కదా! కానీ రూప ఊరుకోదు కదా! ఆమె కూడా ఒక తిక్క కేసే. ఇద్దరు మహిళలు బజారున పడి జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటే గలీజ్ గా ఉంటుంది.. ఇది కూడా అదే బాపతు. ఇక రోహిణి హాసన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పుడు హెచ్ డీ రేవన్న తో గొడవ పెట్టుకుంది. మైసూరు డీసీగా ఉన్నప్పుడు కూడా ఆయనతో గొడవ పెట్టుకుంది. ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం కూడా జరిగిపోయాయి.. చామరాజు నగర్ లో ఆక్సిజన్ కొరత వల్ల 24 మంది కోవిడ్ చనిపోయేందుకు మైసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరి ఆక్సిజన్ ఇవ్వకపోవడమే కారణమని అప్పట్లో చామరాజనగర్ జిల్లా కలెక్టర్ ఆరోపించారు..

రోహిణి,మహేష్ సన్నిహితంగా..
మైసూర్ లోని కేఆర్ నగర్ ఎమ్మెల్యే మహేష్ తో రోహిణి కి విభేదాలు వచ్చాయి. రోహిణి అవినీతిని మహేష్ బయట పెట్టగా, మహేష్ అక్రమంగా భూములు ఇచ్చారని రోహిణి చెప్పిన ఆడియో వైరల్ గా మారింది. రోహిణి పై మహేష్ పరువు నష్టం కేసు కూడా పెట్టారు.. తర్వాత ఎందుకనో ఇద్దరూ రాజీపడటంతో కేసు సద్దుమణిగింది. అయితే మహేష్, రోహిణి కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోను కూడా రూప రిలీజ్ చేసి,ఏవో సందేహాలకు తెరలేపింది. కొడగు, మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా తో రోహిణి కి గొడవలు ఉన్నాయి.. అయితే రోహిణి తన ఫోటోలను మగ అధికారులకు ఎందుకు పంపిస్తోంది అనేదే ఇక్కడ ప్రశ్న..దాల్ మే కుచ్ కాలా హై ఒకప్పుడు నిప్పు అని పేరు తెచ్చుకున్న రోహిణి ప్రభ చివరకు ఇలా బజారున పడిపోయింది.
వాళ్ళూ మనుషులే కదా!
రూప రోహిణి కంటే చాలా సీనియర్.. ఆమె 2000 ఐపీఎస్ బ్యాచ్. ఒకప్పుడు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమాభారతి, మాజీ మంత్రి యువగల్ అరెస్టు సందర్భాల్లో ఆమెకు మంచి పేరు వచ్చింది. జైల్లో శశికళ కు తున్న అక్రమ సౌకర్యాలను బయటపెట్టింది. అనవసర, వ్యక్తిగత కక్ష ప్రదర్శించడం ద్వారా మంచి పేరు పోగొట్టుకుంటున్నది. రోహిణి_ శిల్ప నాగ్, రోహిణి_ రూప… ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావచ్చు. వాళ్ళూ మనుషులే కదా! రాగద్వేషాలు, చిల్లర తగాదాలకు వాళ్లు దూరమేమీ కాదు.