CM Jagan- Private Assets: భూములు ఎలా కొల్లగొట్టాలో ఏపీలో అధికార వైసీపీ నేతలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటే వారికి హద్దే ఉండదు. ప్రైవేటు భూములైతే భయపెట్టి స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలకు మించి వెలుగుచూస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖలోని భూములను ఏ విధంగా కైవసం చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. దశాబ్దాలుగా విశాఖ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుకున్న ప్రభుత్వ భూముల్లో వేలకు వేలు కండోమ్స్ ప్యాకేట్లు పడేశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పడేసి అక్కడ సంఘ విద్రోహక చర్యలు జరుగుతున్నాయని బయట ప్రపంచానికి చూపారు. అర్జెంట్ గా వాటిని వినియోగంలోకి తేకపోతే అక్కడ నేరాలు, ఘోరాలు జరిగిపోతాయని ప్రచారం చేశారు. ఎంచక్కా బినామీలతో భూములను చదును చేయించుకొని హస్తగతం చేసుకున్నారు.

అయితే ఇది ఒక విశాఖకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ రూపొందించుకున్నారు. ఏపీ ప్రజలకు కంటిమీద కునుకు లేని విధంగా కొత్త ఐడియాలజీలతో ముందుకొస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించిన అక్కడ పోస్టర్లు అతికిస్తున్నారు. దీనికి యజమానులు ఎవరూ లేరని.. ప్రభుత్వం ఇక్కడ కట్టడాలు చేస్తోందని పోస్టర్లో రాయిస్తున్నారు. దీంతో అసలు యాజమానికి ఉరుకులు, పరుగులపై అక్కడకు చేరుకుంటున్నారు. ఆ స్థలం తమదేనని చెబితే పన్నుల కట్టనందుకే స్వాధీనం చేసుకుంటున్నామని.. అర్జెంట్ గా పన్నులు కట్టాలని ఆదేశాలిస్తున్నారు. అయితే ఏపీ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఖాళీగా ఉండే స్థలాలు వద్ద ఇటువంటి పోస్టర్లే వెలుస్తున్నాయి. దొరికితే దొంగ..దొరకకపోతే దొర అన్నట్టు.. వివాదాస్పద ల్యాండ్ అయి,, యజమానులు రాకుంటే మాత్రం అది నేతల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. అంటే వస్తే పన్నుల రూపంలో ఆదాయం.. లేకుంటే స్థలం హస్తగతం.. ఇది వైసీపీ నేతల నయా ప్లాన్ అన్న మాట.
ఈ పోస్టర్ల రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇవి వైరల్ గా మారుతున్నాయి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల పన్నులు పెరిగాయి. ఆస్తి, ఇంటి పన్ను.. చివరకు ఖాళీ స్థలాలకు సైతం పన్ను వేసే స్టేజ్ కు వైసీపీ చేరుకుంది. ఈ పన్నులను సైతం ఏడాదికేడాది పెంచుకుంటూ పోతున్నారు. పన్ను కట్టకుంటే కబ్జా తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ దుస్థితిని తలచుకొని ఏపీ ప్రజలు తెగ బాధపడిపోతున్నారు. ఎప్పుడో దశాబ్దాల కిందట భవిష్యత్ అవసరాల కోసం స్థలాన్ని కొనుగోలుచేస్తే.. ఇప్పటి ధరకుఅనుగుణంగా పన్ను చెల్లించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వేలకు వేలు పన్నుల రూపంలో కట్టడమంటే తలకు మించిన భారంగా పరిగణిస్తున్నారు.

అయితే ప్రభుత్వ ప్రైవేటు పెత్తనం చూస్తే సగటు మనిషికి భయం వేస్తోంది. ఇప్పటికే ఉద్యోగులు, పింఛన్ల ఖాతా నుంచి పీఎఫ్ మాయం చేసినట్టు.. ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టినట్టు.. చివరకు తమకు తెలియకుండా కాలనీల పేరుతో జగన్ సర్కారు కుదువ పెడుతోందనని సామాన్యులు భయపడే స్టేజ్ కి పరిస్థితి వచ్చింది. ఖాళీ స్థలాల కోసం ఎవరైనా సమాచారం లేకుండా రాకుంటే వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ప్రభుత్వం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి తనఖా పెట్టాలంటే ఇక ఏం మిగల్లేదు కాబట్టి.. ఇకపై ప్రైవేటు ఆస్తులపై పడతారన్న బెంగా ఏపీ సమాజానికి వెంటాడుతోంది.