Pawan Kalyan Wishes Jagan: నేడు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..సోషల్ మీడియా లో కూడా ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆయనకీ వెల్లువలాగా కురుస్తున్నాయి..ఇక మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా కొనసాగుతున్న టీడీపీ మరియు జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ ఖాతాల ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు.. విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి శుభాకాంక్షలు తెలియచేయడమే సంచలనంగా మారింది.

ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ వర్సెస్ జనసేన పార్టీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు ఉన్నాయి..పవన్ కళ్యాణ్ మరియు జగన్ ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ని పోలీస్ యంత్రాంగం తో పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ ని జగన్ ఎంతలా ఇబ్బంది పెట్టాడో అందరికి తెలిసిందే.
అధికార యంత్రాంగం తో అలుపెరుగని యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్, మనసు లో ఎలాంటి కల్ముషం పెట్టుకోకుండా నేడు జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడం విమర్శకులను సైతం ప్రశంసించేలా చేసింది..’ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను..ఆయనకీ ఆ దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అకౌంట్ ద్వారా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియచేసాడు.

ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారిపోయింది..మరి జగన్ ఈ ట్వీట్ కి స్పందించి కృతఙ్ఞతలు తెలియచేస్తాడా లేదా అనేది చూడాలి..ఒకవేళ చేస్తే ఇరు పార్టీల అభిమానులు మరియు కార్యకర్తలు సంతోషిస్తారు..ఇక పవన్ కళ్యాణ్ త్వరలోనే తన ‘వారాహి’ బస్సు లో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానుంది.
శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/7ZEtLyrwyS
— JanaSena Party (@JanaSenaParty) December 21, 2022