spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలకృష్ణ ఇంకా మారడా? ఎన్నాళ్ళు నెట్టుకొస్తాడు ఈ నరుకుడితో.....

Balakrishna: బాలకృష్ణ ఇంకా మారడా? ఎన్నాళ్ళు నెట్టుకొస్తాడు ఈ నరుకుడితో…..

Balakrishna:  రాయ‌లేలిన సీమ రాయ‌ల‌సీమ‌. ర‌త్నాలు రాశులుగా పోసి అమ్మిన ర‌త‌నాల సీమ‌. ఇది చ‌రిత్ర‌. బాంబుల మోత‌లు, తెగిన కుత్తుక‌ల నెత్తుటి క‌థ‌లు, వేట‌కొడ‌వ‌ళ్ల వీర విహారాలు… ఇది కూడ చ‌రిత్రే. అభివృద్ధి కోసం అర్రులు చాస్తూ, నీటి కోసం నోరెళ్లబెట్టుకుని ఎదురుచూస్తున్న సీమ వ‌ర్త‌మానం. చరిత్ర‌నే వ‌ర్త‌మానంగా సినిమాల్లో చిత్రీక‌రించ‌డం దౌర్భాగ్యం. నంద‌మూరి బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాతో మ‌రోసారి సీమ అస్థిత్వం పై చ‌ర్చ‌కు తెర‌లేసింది.

Balakrishna
Balakrishna

రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజాన్ని సినిమా వ్యాపార వ‌స్తువుగా మార్చేసింది. కొన్నేళ్ల క్రితం కాసుల పంట పండించింది. ట్రెండ్ ముగిసింది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన సినిమాలు పెవిలియ‌న్ బాట ప‌ట్టాయి. ఫ‌లితంగా ట్రెండ్ మారింది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం పై సినిమాలు త‌గ్గాయి. కానీ నంద‌మూరి బాల‌కృష్ణ మాత్రం త‌గ్గ‌లేదు. కొత్త సీసాలో పాత సారా పోసిన‌ట్టు వీర‌సింహారెడ్డిని తెర‌పైకి తెచ్చారు. అదే ఫ్యాక్ష‌న్ క‌థ‌నే, అదే న‌రుకుడినే సినిమా మొత్తం చూపిస్తూ.. బాల‌య్యా ఇంక మార‌వా ? అన్న ఫీలింగ్ ప్రేక్ష‌కుల‌కు క‌లిగిస్తున్నాడు.

వీర‌సింహారెడ్డి సినిమా పై రాయ‌ల‌సీమ‌వాసులు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన‌ప్ప‌టికీ.. రాయ‌ల‌సీమ వాదులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఫ్యాక్ష‌న్ క‌థ‌ల‌తో రాయ‌ల‌సీమ అస్థిత్వం పై దాడి చేస్తున్నార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కాల‌పు ఫ్యాక్ష‌నిజం నేడు సీమ‌లో లేద‌ని, సీమ‌ను మ‌రో కోణంలో చూడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తుచేస్తున్నారు. బాంబులు చుట్ట‌డాలు, విస‌రడాలు, వేట‌కొడ‌వ‌ళ్ల ప‌ట్ట‌డాలు నేటి సీమ‌లో క‌నిపించ‌వు. పుస్త‌కాలు ప‌ట్టిన చేతులు, వ‌స‌ల‌బాట ప‌ట్టిన నెత్తులు, నీటి కోసం నోరు తెరుచుకున్న బీడు భూములు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ హోల్డ‌ర్లు నేటి రాయ‌ల‌సీమ‌లో క‌నిపిస్తారు.

Balakrishna
Balakrishna

ఫాక్ష‌నిజం రాయ‌ల‌సీమ‌లో ఒక అవ‌శేషం మాత్ర‌మే. పొరుగున ఉన్న బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్ లు రాయ‌ల‌సీమ‌వాసుల ఆలోచ‌న‌ల్లో మార్పు తెచ్చాయి. అభివృధ్దితో వ‌చ్చే అవ‌కాశాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపాయి. ఫ్యాక్ష‌నిస్టుల వెంట వెళ్లే సీమ యువ‌త లేదిప్పుడు. ఐటీ కంపెనీల వెంట ప‌డే సీమ యువ‌త నేటి నిజం. ఉపాధి అవ‌కాశాల కోసం వ‌లస‌పోతున్నారు కానీ రాజ‌కీయ నాయ‌కుల వెంట తిర‌గ‌డంలేదు. సీమ‌లో అభివృద్ధి జ‌ర‌గాల‌ని ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని కోరుకుంటున్నారు. అంతే త‌ప్ప ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్ని కోరుకోవ‌డం లేదు. అరొక‌ర ఘ‌ట‌నలు జ‌రిగినా అవి రాజ‌కీయ‌, స్వార్థ‌పూరిత ప్రేరేపిత ఘ‌ట‌న‌లే త‌ప్పా .. ఫ్యాక్ష‌న్ ప‌గ‌లు కాదు.

సీమ ఫ్యాక్ష‌నిజాన్ని ఇన్నాళ్లూ వ్యాపార వ‌స్తువుగా మార్చుకుని కోట్లు సంపాదించారు. ఇక‌నైనా మారాల‌ని రాయ‌ల‌సీమ బుద్ధిజీవులు కోరుతున్నారు. సీమ స‌మ‌స్య‌ల పైన‌, నీటి అవ‌స‌రాల పైన‌, పారిశ్రామికాభివృద్ధి పై క‌థ‌లు, క‌థ‌లుగా సినిమాలో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సీమ‌లో వ‌ర్త‌మానం గురించి చ‌ర్చించ‌మంటున్నారు. ఫ్యాక్ష‌నిజం చ‌రిత్ర‌. కొంద‌రి స్వార్థ‌పూరిత క్రీడ‌. ఆ క్రీడ‌లో బ‌లిప‌శులు మాత్రం సామాన్యులు. ఆ ఫ్యాక్ష‌నిస్టులే నేటి పెట్టుబ‌డిదారులు, రాజ‌కీయ నేత‌లు. స్వ‌ప్ర‌యోజ‌నా కోసం జ‌రిగిన ఫ్యాక్ష‌నిజాన్ని మ‌రోసారి సినిమాలో చూపి త‌నెవెల్లా గాయాల‌తో బాధ‌ప‌డుతున్న సీమ‌ను గుచ్చిగుచ్చి చంప‌వ‌ద్దంటూ సీమ బుద్ధిజీవులు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను, సినిమారంగాన్ని కోరుతున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper