Girls Fighting: చిన్న చిన్న విషయాలకు కూడా మనుషుల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. కొన్నిసార్లు వారి పోరాటం తీవ్రంగా మారుతోంది. తమను తాము చంపుకోవడానికి సిద్ధంగా ఉండే విధంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడే ఇలాంటి.. సందర్భాలు చూస్తున్నాం. మహిళలు, అమ్మాయిలు కూడా కొట్టుకోవడంలో మగవాళ్లకు తాము ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నాలుగ రోజుల క్రితం బెంగళూర్‌లో ఓ చీర కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఓ వ్యక్తి కోసం రోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తీవ్రమైన గొడవే అయినప్పటికీ.. ఈ ఫైట్ చూసేవారికి నవ్వు తెప్పిస్తోంది.
బీప్ సౌండ్ బూతులు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడం తక్కువే ఉన్నా.. బీప్ సౌండ్ వేసే బూతులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో నిడివి రెండు నిమిషాలే ఉంది. కానీ ఇందులో మూడుసార్లు బీప్ సౌండ్ వచ్చింది. అంతే వినకూడని బూతులు తిట్టుకున్నారన్నమాట.
ఓదార్పు.. మాటా మంతి..
ఇదిలా ఉండగా యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నట్లు వీడియోను బట్టి అర్థమవుతోంది. అయితే ఈసమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి.. ఓ యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం కనిపించింది. దీంతో అతని కోసమే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారా అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. మరోవైపు గాయపడిన అమ్మాయిని అక్కడే ఉన్న మరో అమ్మాయి ఓదారుస్తూ వీడియోలో కనిపించింది. ఇద్దరు కొట్టుకున్నప్పుడు పక్కనే నలుగురు ఉన్నారు. కానీ, వారు ఇద్దరినీ ఆపే ప్రయత్నం చేయలేదు.
ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంత బలుపు ఎందుకు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. వాడులో అంత ఏముందని కొట్టుకుంటున్నారని కొందరు, ఇప్పుడు కొట్టుకుంటారు, తర్వాత ప్రియుడి సాయంతో ఎవరో ఒకర్ని లేపేస్తారు అని మరికొందరు కామెంట్ పెడుతున్నారు. అమ్మాయిల వయసు చూస్తే మాత్రం ఇద్దరూ జూనియర్ ఇంటర్ చదివే అమ్మాయిల్లా కనిపిస్తున్నారు. అందుకే కొందరు వయసు అలాంటిది అని కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు.