India Pakistan War: జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో వారం క్రితం సైకిన వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఇందులో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అయితే ఈ దాడికి తాము బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు. మొదట ఇది ప్రమాదంగా భావించారు. కానీ, మరణించిన సైకికుల శరీరాల్లో బుల్లెట్లు ఉండడంతో ఇది పాకిస్తాన్ ప్రేరేపిత దాడిగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ దాడితో భారత్ కంటే ఎక్కువగా పాకిస్తానీలే భయపడుతున్నారు. భారత్ మళ్లీ యుద్ధం చేస్తుందేమో అన్న ఆందోళన దాయాది దేశ ప్రజల్లో వ్యక్తమవుతోంది.
పూంచ్ ఘటనపై విమర్శలు..
అయితే పూంచ్ ఘటనపై విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఉగ్రవాదులను అరికట్టామని చెప్పుకుంటున్న మోదీ.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించాయి. జర్నలిస్టులు కూడా మోదీ వైఫల్యాలంటూ కథనాలు వండి వచ్చారు. తిట్టిపోశారు. ఉగ్రవాదుల అణచివేత పేరుతులో, జమ్మూకశ్మీర్‌కు స్వేచ్ఛ పేరుతో మోదీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉగ్రవాదం పెరిగేలా చేస్తున్నారని కూడా ఆరోపించారు.
పుల్వామా, పఠాన్‌కోట్ ఘటనల తర్వాత..
భారత దేశంలో విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తుంటే.. పాకిస్తాన్ ప్రజలు మాత్రం మోదీతో మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొసుందో అని టెన్షన్ పడుతున్నారు. గతంలో పుల్వామా, పఠాన్‌కోట్‌పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడిచేసి సైనికులను చంపేశాయి. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై యుద్ధమే ప్రకటించింది. సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్టాన్‌లోని ఉగ్రస్థావరాలతోపాటు సైనిక స్థావరాలను కూల్చేసింది. రెండు సర్జికల్ స్ట్రైక్‌లతో పాకిస్తాన్‌కు భారీగా నష్టం జరిగింది.
అభినందన్‌ను స్వయంగా అప్పగించిన పాక్..
పఠాన్‌కోట్ దాడి తర్వాత జరిపిన ప్రతిదాడిలో భారత సైనికుడు అభినందన్ పాకిస్తాన్ సైనికులకు చిక్కాడు. అతడిని యుద్ధఖైదీగా పాకిస్తాన్ ప్రకటించింది. కానీ, భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రపంచం మొత్తం చూస్తుండగానే కేంద్రం పాకిస్తాన్‌పై ఆయుధాలు మోహరించింది. అభినందన్‌ను అప్పగించకుంటే పాకిస్తాన్ రూపురేఖలు మార్చేస్తామన్న సంకేతాలను మోదీ పాకిస్తాన్‌కు పంపించారు. దీంతో దిగివచ్చిన పాకిస్తాన్ సైన్యం విధిలేని పరిస్థితిలో అభినందన్‌ను తీసుకువచ్చి మరీ భారత్‌కు అప్పగించింది.
ప్రస్తుత పరిస్థితిలో కవ్వింపు అవసరమా..
ప్రస్తుతం పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రపంచ దేశాలు అందిస్తున్న సాయంతోనే అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. తిండి లేక, నూనెలేక ఒకవైపు ప్రజలు అల్లాడుతుంటే.. ప్రభుత్వం భారత్‌తో కవ్వింపునకు దిగడంపై పాకిస్తాన్ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల నుంచి తప్పించుకోవడానికేనా..
పాకిస్తాన్‌లో మే చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాలని అక్కడి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి, ఆర్థిక స్థోమత ఆ దేశంలో లేవు. ఈ నేపథ్యంలో ఎన్నికల నుంచి తప్పించుకోవడానికే పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌పై కవ్వింపులకు దిగుతోందన్న విమర్శలు పాకిస్తానీల నుంచే వినిపిస్తున్నాయి. పాలకుల తప్పిదానికి తాము బలికావాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంత శక్తి లేదు..
ఇక భారత్‌తో యుద్ధం చేసే శక్తి ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఉందా అంటే లేదని అంటున్నాడు ఆదేశ మాజీ సైనికాదికారి కమార్‌జావిద్ బాజ్వా. పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఆ దేశ సైనికాధికారితో జర్నలిస్టులు అమీద్ మీర్, నజీమ్ జహ్రా మాట్లాడారు. యూకే44 చానెల్ నిర్వహించిన ఈ సమావేశంలో బజ్వా పాకిస్తాన్ సైన్యం గురించి వాస్తవాలు వెల్లడించారు. భారత్‌తో యుద్ధం చేసేంత శక్తి పాకిస్తాన్‌కు లేదని, అంత సైన్యం, ఆయుధాలు కూడా తమవద్ద లేవని స్పష్టం చేశాడు. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్నప్పుడే యుద్ధం చేయడానికి భయపడిన పాకిస్తాన్.. తాజాగా భారత్‌తో కవ్విపు చర్యలకు దిగడంపై ఆదేశ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల తీరుపై మండిపడుతున్నారు.