spot_img
Homeట్రెండింగ్ న్యూస్Road Accident: ఆరుగురి ప్రాణాలు తీసిన బస్సు- లారీ

Road Accident: ఆరుగురి ప్రాణాలు తీసిన బస్సు- లారీ

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో బస్సు నుజ్జునుజ్జుగా కనిపించింది. తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జుగా మారింది. అర్థరాత్రి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేటు బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఆరుగురు మృతి చెందగా.. 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాల పాలైన వారిలో చంద్రశేఖర్, సురేష్, గోపినాథ్, మనోజ్, రాజకుమార్, ఎస్. రమణ, పవన్, ధనవేశ్వర్, రణధీర్, త్రికరన్,శ్వేత, అజిత, కన్నన్, రూప, మైథిలి, అక్షయ్, గణేష్, నితిష్, లోకేష్, లక్ష్మి, కమలమ్మ, నిర్మల, కేశవ్ ఉన్నారు. వీరంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper