spot_img
Homeఎంటర్టైన్మెంట్Balu Movie: పవన్ కల్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ ను ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Balu Movie: పవన్ కల్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ ను ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

 

Balu Movie
neha oberoi

Balu Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ఇమేజ్ మాములిది కాదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో కూడా కాస్త జోష్ మొదలవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ అన్నీ కలగలిపి పవన్ సినిమాల్లో ఉంటాయని ఫ్యాన్ష్ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే పవన్ నటించిన సినిమా హిట్టు కాకపోయినా ఆయన సినిమాలో నటించిన వారికి గుర్తింపు వస్తుంటుంది. పవన్ నటించిన చాలా మంది హీరోయిన్లు ఇతర సినిమాల్లో అవకాశాలు వచ్చి స్టార్లుగా గుర్తింపు తెచ్చకున్నారు. మరికొందరు ఇతర రంగాల్లో సెటిలయ్యారు. అయితే ఆయనతో కలిసి ‘బాలు’ సినిమాలో నటించిన నేహ ఒబేరాయ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో నేహ కనిపించేది కాసేపే అయినా అమాయకంగా నటించి ఆకట్టుకుంది. మరి ఆమెను ఇప్పుడు చూస్తే మతి పోతుంది.. ఆమె ఎలా ఉందో ఓ లుక్కేయండి.

Balu Movie
neha oberoi

బాలీవుడ్ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కుమార్తె నేహ ఒబెరాయ్. ఈమె ముంబైలో 1985 సెప్టెంబర్ 15న జన్మించింది. బీ టౌన్ పై అవగాహన ఉన్నా ఆమె తెలుగు సినిమా ‘బాలు’ తోనే ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే నేహ కు ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో హిందీ సినిమా ‘వుడ్ స్టాక్ విల్లా’లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా యావరేజ్ సక్సెస్ అయినా నేహ కు మాత్రం మంచి మార్కలే పడ్డాయి. ఆ తరువాత తెలుగులో జగపతి బాబు నటించిన ‘బ్రహ్మస్త్రం’లో మరోసారి కనిపించింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఇక నేహ తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదు.

పవన్ కల్యాణ్ తో కలిసి ‘బాలు’ సినిమాలో నటించిన నేహకు తెలుగులో అభిమానులు బాగానే ఉన్నారు. ఈ సినిమాలో అమాయకంగా నటించిన ఆమెను చూసి ఫిదా అయ్యారు. అయ్యారు. ఇందులో నేహ తో పాటు శ్రియా నటించినా నేహ ఒబేరాయ్ కే ఎక్కువ గుర్తింపు వచ్చిందని అనుకుంటారు. సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నేహ యాక్టివ్ గానే ఉంటున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేసే బిజీలో ఉన్నారు.

neha oberoi
neha oberoi

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే నేహ 2010 డిసెంబర్ 14న ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకున్నారు. చాలా మంది హీరోయిన్లు పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెబుతారు. కానీ నేహ మాత్రం సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ చూసి పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ నేహ వన్నెతరగని అందంతో అలాగే ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. మరోసారి సినిమాల్లోకి వస్తారా? అని అడుతున్నారు. కానీ నేహ మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వడం లేదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper