
Ghost Village : మనం కథల్లో చెప్పుకుంటా కదా చీమలు దూరని చిట్టడవి. కాకులు దూరని కారవడవి. కానీ ఇక్కడ మనుషులే లేని ఊరు ఉంది తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఆ ఊరు నిర్మాణుష్యంగా ఉంటుంది. ఇళ్లు ఉంటాయి కానీ మనుషులు ఉండరు. ఎటు చూసిన మొండి గోడలు దర్శనమిస్తాయి. ఊరంతా వల్లకాడులా ఉంటుంది. భయంకరంగా అనిపిస్తుంది. ఆ ఊరు ఎందుకలా ఉంది? అక్కడి ప్రజలంతా ఏమయ్యారు? ఎందుకు ఊరు ఒంటిరైపోయిందంటే మనకు అక్కడ జరిగిన విషయాలు తెలియాల్సిందే.
కుల్ధారా గ్రామం
ఇది రాజస్థాన్ లోని కుల్ధారా గ్రామం ఎటు చూసినా భయంకరంగా కనిపిస్తుంది. జనాలు మాత్రం ఉండరు. ఊరు అయితే ఉంటుంది. ఒక్క పురుగు కూడా కనిపించదు. చీకటి పడితే భయమే. అక్కడ దెయ్యాలు తిరుగుతాయని చెబుతారు. సాయంత్రం అయిందంటే అటు వైపు వెళ్లడానికి ధైర్యం చేయరు. చీకటి పడితే దెయ్యాలు సంచరిస్తాయి అక్కడి వారి నమ్మకం.
ఊరు ఎందుకు ఖాళీ చేశారు?
పదమూడో శతాబ్ధం వరకు అక్కడ ప్రజలు ఉండేవారు. పందొమ్మిదో శతాబ్దంలో ప్రజలందరు ఊరు విడిచి పోయారు. ఆ ప్రాంతాన్ని పాలించే సలీం సింగ్ అనే సేనాని ఆ ఊరి పెద్ద కూతురుపై కన్నేశాడట. తనను అతడికి ఇచ్చి వివాహం చేయాలని ఒత్తిడి తెచ్చాడట. దీంతో ఆ ప్రాంతంలోని 85 గ్రామాల పెద్దలు ఓ రోజు సమావేశమై తమ ఊర్లు విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే వారు ఆ ఊరు విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంకా ఇతర కారణాలు
ఆ ఊళ్లో భయంకరమైన కరువు రావడంతోనే ఊరు ఖాళీ చేయాల్సి వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది. ఊరు శాపగ్రస్తమైందని ఊరి పెద్ద చెప్పడంతో ఖాళీ చేయాల్సి వచ్చిందని మరో కథ చెబుతారు. ఇలా కుల్ధారా ఊరుపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఊరు మాత్రం పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం అక్కడకు రావడానికి కూడా జంకుతున్నారు.

రాత్రయితే
రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని అక్కడి వారు చెబుతారు. ప్రతాత్మలు సంచరిస్తాయని నమ్ముతారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలని అక్కడి ప్రభుత్వం భావించినా కుదరడం లేదు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టకపోవడంతో కుల్ధారా నిర్మాణుష్యంగా మారింది. దీంతో ఇక్కడ ఉండేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు.
ఎందుకు ఇలా..
ఆ ఊరు ఖాళీ చేసే సమయంలోనే తరువాత కాలంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని శాపం పెట్టారట. అందుకే ఆ ఊరు ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయింది. జైసల్మీర్ మంత్రి సలీం సింగ్ నిర్వాకంతో ఆ గ్రామం మట్టిదిబ్బలా మారిపోయింది. అతడి దుష్ట పన్నాగంతోనే ఆ ఊరు పనికి రాకుండా పోయింది. ప్రభువు ప్రజలను పాలించాలి కానీ వారిని కష్టాలకు గురి చేయకూడదు. ఏది ఏమైనా అప్పడు చేసిన దానికి ఆ గ్రామం కొన్నేళ్లుగా దాని ఫలితాలు అనుభవిస్తూనే ఉంది.