Ashu Reddy- Hari: బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో నాకు పెళ్ళైపోయింది. ఆమె నేను లేచిపోయాం అంటూ సంచలనం రేపాడు బుల్లితెర కమెడియన్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అషురెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. బోల్డ్ ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన అషురెడ్డి అనూహ్యంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్నారు. సీజన్ 3 లో పాల్గొన్న అషురెడ్డి తన గ్లామర్ తో మరింత పాపులర్ అయ్యారు. గేమ్ సంగతి ఎలా ఉన్నా… స్కిన్ షోతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది.

గేమ్ ఆడకుండా హౌస్లో మనుగడ సాధ్యం కాదని అషురెడ్డి విషయంలో రుజువైంది. కేవలం ఐదవ వారమే అషురెడ్డి జర్నీ ముగిసింది. అయినప్పటికీ షో ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. ఆమెకు బుల్లితెరపై ఆఫర్స్ మొదలయ్యాయి. పలు ఈవెంట్స్ లో అషురెడ్డి సందడి చేశారు. షో ఏదైనా అషురెడ్డి బోల్డ్నెస్ అసలు తగ్గించేది కాదు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేయడం అషురెడ్డి నైజం. కాగా అషురెడ్డి బుల్లితెరపై ఒక లవ్ ట్రాక్ కూడా నడిపింది.
అదిరింది షోతో వెలుగులోకి వచ్చిన హరితో అషురెడ్డి రొమాన్స్ చేసింది. కామెడీ స్టార్స్ స్కిట్స్ లో ఈ జంట కొంచెం హద్దులు దాటి కెమిస్ట్రీ పంచారు. అషురెడ్డిని ప్రేమిస్తున్నానంటూ హరి ఆమె పేరు టాటూ వేయించుకోవడం కొసమెరుపు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్, వర్ష-ఇమ్మానియేల్ మాదిరి లవ్ బర్డ్స్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి అనుకున్నారు. అయితే వాళ్ళ స్థాయిలో ఫేమస్ కాలేదు. కాగా లేటెస్ట్ కామెడీ స్టార్స్ స్కిట్ లో హరి సంచలన కామెంట్స్ చేశారు. అషురెడ్డి నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాము, ఒక లవ్ లెటర్ తో ఆమెను పడేశానని సంచలన కామెంట్స్ చేశారు.

ఇది స్కిట్ లో భాగమైనప్పటికీ హరి లేచిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కామెడీ స్టార్స్ షోకి సంబంధించిన ఈ స్కిట్ వైరల్ అవుతుంది. మరో వైపు బోల్డ్ ఫోటో షూట్స్, ఇంటర్వూస్ తో అషురెడ్డి కాకరేపుతున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్వ్యూ తీవ్ర విమర్శల పాలైంది. అషురెడ్డి పాదం పై ముద్దు పెట్టిన వర్మ కాలి వేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు. ఇక ఇద్దరి మధ్య బూతు సంభాషణ సాగింది. డబ్బుల కోసం మరింత దిగజారిపోతున్నారని సాంప్రదాయ వాదులు ఆరోపణలు చేస్తున్నారు.