Sandeep Kishan : ఈడొచ్చాక కోరికల గుర్రాలు అదుపులో ఉంచుకోవడం కష్టం. అందమైన అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులు కావడం కామన్. అలా కలిసిన జంట సెలెబ్రిటీలు అయితే అది న్యూస్ అవుతుంది. హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 2014లో విడుదలైన రారా కృష్ణయ్య మూవీలో సందీప్ కిషన్ -రెజీనా కలిసి నటించారు. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

రెజీనా గ్లామర్ మాత్రం హైలెట్ అయ్యింది. గతంలో సందీప్ కిషన్- రెజీనా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కథనాలు వెలువడ్డాయి. కొన్నాళ్ళకు ఆ పుకార్లు సద్దుమణిగాయి. తాజాగా మీడియాలో వీరి ఎఫైర్ రూమర్స్ మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ కిషన్, రెజీనా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోలు చూస్తే ఎఫైర్ వార్తలు నిజమే అనిపిస్తుంది.
నైట్ పార్టీలు, వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఒకరితో మరొకరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. సరైన సక్సెస్ చూడని సందీప్ కిషన్, రెజీనాలకు పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం సందీప్ వయసు 35 కాగా, రెజీనా వయసు 32. నిజంగా ప్రేమా దోమా ఏదైనా ఉంటే చక్కగా పెళ్లి పీటలు ఎక్కితే బెటర్. ఈడు జోడు చక్కగా ఉంటారని అభిమానులు కోరుకుంటున్నారు.
తమిళ అమ్మాయి అయిన రెజీనా తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేస్తున్నారు. సందీప్ సైతం రెండు భాషల్లో నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తర్వాత సందీప్ కి ఆ స్థాయి హిట్ మరలా పడలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్ మైఖేల్ టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలాగే మరో తెలుగు చిత్రం, రెండు తమిళ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. ఇక రెజీనా విషయానికి వస్తే ఏకంగా అరడజను ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల రెజీనా నటించిన శాకిని ఢాకిని చిత్రం విడుదలైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నివేదా థామస్ మరో హీరోయిన్ గా నటించారు.