
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా మజాకా… వారి అభిమాన హీరోతో పెట్టుకుంటే? ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకుంటారా?… రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్నారు. తమ హీరోని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని ఆధారాలతో సహా బజారుకీడుస్తున్నారు. టీడీపీ పార్టీ సానుకూల మీడియాగా పేరుగాంచిన ఓ సంస్థ అధినేత ఆదివారం సంచలన కథనం ప్రచురించారు. సదరు కథనం ప్రకారం తెలంగాణా సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ తో ఒక అనైతిక ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అనుకూలంగా రాజకీయాలు చేస్తే… వెయ్యి కోట్లు ఇస్తానంటూ ఆశజూపారట. ఆ విధంగా చంద్రబాబు గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నారట. పవన్ వద్దకు కేసీఆర్ తన దూతలను పంపాడట.
ఈ కథనం జనసేన వర్గాల్లో తీవ్ర ఆవేశం రగిలించింది. పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దండెత్తారు. సదరు కథనం ప్రచురించిన మీడియా సంస్థ అధినేతను ఫుట్ బాల ఆడుకుంటున్నారు. మనోడి లొసుగులన్నీ తవ్వుతూ సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. బ్రోకర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ నెగిటివ్ ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.
జనసేన ప్రజల్లో అంతకంతకు ప్రబల శక్తిగా మారుతున్న సమయంలో ఏదో విధంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుష్ప్రచారం ద్వారా జనసేన క్రెడిబిలిటీ నాశనం చేసేందుకు కుట్రలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పవన్ అభిమానులు సోషల్ మీడియా అనే ఆయుధం వాడి తమ నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకు పెద్ద పెద్ద మీడియా సంస్థల అండ లేకున్నా… వీటన్నింటికంటే వేగవంతమైన, బలమైన సోషల్ మీడియా అండ ఉంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సంచలనాలు చేయనుందని పలువురు నమ్ముతున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువ కానున్నారు. వారి సమస్యలు తెలుసుకొని లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఏపీలో ఎన్నికలకు కేవలం 14 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో పవన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది.
Jara Jagarata ra bidda @abntelugutv
💦💦#ABNBrokerKrishna pic.twitter.com/iHTjOzZGeI— OG CULT 💣💨🧨🔥 (@IconKittu) February 19, 2023