
Tarakaratna- Balakrishna: ” తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగుంది. అప్పటిదాకా అచేతనంగా పడి ఉన్న ఆయన చెవిలో బాలయ్య మృత్యుంజయ మంత్రం చదివారు. వెంటనే తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.” ఇదీ ఓ నెత్తి మాసిన పేపర్ రాసిన వార్త.
” తారక్ అన్నయ్య తో మేము మాట్లాడాము. ఆయన సైగ చేశాడు. త్వరలో కోలుకుంటాడు.. మాకు ఆ నమ్మకం ఉంది.” ఇదీ ఓ పచ్చ ఛానెల్ ప్రసారం చేసిన కథనం.
వాస్తవానికి ఒక మనిషి తీవ్రమైన గుండెపోటుతో అంతర్గత రక్తస్రావం జరిగే మెదడు పని చేయడం పూర్తిగా నిలిచిపోతే అతడు ఇక ఏ దశలోనూ కోలుకోవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ కోరుకున్నాడు అంటే ఇక అతనికి తిరుగులేదు.. కానీ ఇదే విషయాన్ని పచ్చ మీడియా చెప్పింది. తారకరత్న విషయంలో అతడు చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ నందమూరి కుటుంబానికి ముఖ్యంగా బాలయ్యకు క్రెడిట్ దక్కాలని ఆపసోపాలు పడింది. వాస్తవానికి ఒక మనిషి మెదడు పనిచేయడం ఆగిపోతే దాని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యం. పైగా తారకరత్న తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అంతకుముందే ఆయనకు గుండె సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సందర్భాల్లో అసలు విషయం చెప్పకుండా, మంచం మీద ఆ చేతనంగా పడి ఉన్న మనిషిని వదిలేసి, అతడిని పరామర్శించేందుకు వచ్చిన వారికి బాకాలు ఊదడం, బాజాలు మోగించడం పచ్చ మీడియాకే చెల్లింది.

ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు తోటి మనుషులు ఎంతో కొంత బాధను వ్యక్తపరుస్తారు. బాగుండాలని కోరుకుంటారు. బాగుపడాలని భగవంతుడిని వేడుకుంటారు. కానీ ఇదే పచ్చ మీడియా మాత్రం అసలుకు వక్ర భాష్యం చెప్పి… తారకరత్న కోలుకుంటున్నాడు, తిరిగి మామూలు మనిషి అవుతాడు అంటూ డప్పులు కొట్టింది. బాలకృష్ణ రావడమే ఆలస్యం తారకరత్న మామూలు మనిషి అయ్యాడు అన్నంత రేంజ్ లో ప్రచారం చేసింది. నిజానికి తారకరత్న బ్రెయిన్ ఎప్పుడో డెడ్ అయింది. లక్ష్మీపార్వతి చెప్పిన వివరాల ప్రకారం.. లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రకు చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు, జనాల మైండ్ డైవర్ట్ కాకుండా ఉండేందుకు తారకరత్న అసలు ఆరోగ్య స్థితిని దాచిపెట్టారని, అతడు ఎప్పుడో చనిపోయాడని… కానీ ఆ విషయాన్ని జనాలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని ఆరోపించారు. ఆసుపత్రి వైద్యులను కూడా మేనేజ్ చేశారని సంచలన విషయాలు బయట పెట్టారు. వాస్తవ పరిస్థితి కూడా అలాగే అనిపిస్తోంది.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి బతకడం అసాధ్యం, ఒకవేళ బతికినప్పటికీ మామూలు మనిషి అవ్వడం అసాధ్యం.. ఒక్క మృత్యుంజయ మంత్రం చెప్పగానే మెదడు పనిచేయడం ప్రారంభిస్తుందా? ఇక్కడ మృత్యుంజయ మంత్రాన్ని కించపరచడం మా ఉద్దేశం కాదు. కానీ వాస్తవ విషయానికి మసిపూసి మారేడు కాయ చేయడమే ఇబ్బంది కరం. అందులోనూ ఒక మనిషి విషమస్థితిని కూడా ప్రచారానికి వాడుకోవడం మరింత ప్రమాదకరం.