spot_img
Homeఎంటర్టైన్మెంట్Nirmalamma: నిర్మలమ్మగారి మనవడు కూడా మంచి నటుడే!   

Nirmalamma: నిర్మలమ్మగారి మనవడు కూడా మంచి నటుడే!   

Nirmalamma: తెలుగు  సినిమా రంగం  వయసు కంటే..  ఆమె వయసు పెద్దది.  ఆమె  నాటకాల్లో  ఒక వెలుగు వెలిగి..   సినిమాల్లో  అమ్మగా, అమ్మమ్మగా  తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమె  అలనాటి నటీమణి నిర్మలమ్మ.   తెలుగు సినిమాకు  ఆమె బామ్మ,  ఆ రోజుల్లో అనగా నలభై ఏళ్ల క్రితం  ఆమెను చూసిన  ప్రేక్షకులు అంతా  ‘మా బామ్మ’ అని మనసుకు దగ్గరగా భావించే వాళ్ళు.

ఇక నిర్మలమ్మ గారి సినీ జీవితం గురించి ముచ్చటించుకుంటే.. నిర్మలమ్మ గారి జీవితమే ఓ నాటకం. ఆమెను  ఓ సినిమా షూటింగ్‌ లో చూసి ప్రేమలో పడ్డాడు  ఆ సినిమా  ప్రొడక్షన్‌ మేనేజర్‌ జీవి కృష్ణారావు.   ఆమె ఎంతో పద్దతిగా ఉంది అనుకున్నాడు. అందుకే,  తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పకుండా..   నిర్మలమ్మగారి  ఇంటికి వెళ్లి  ఆమె నాన్నగారితో  పెళ్లి సంబంధం మాట్లాడాడు.

అందరూ ఒప్పుకున్నారు,  కానీ  నిర్మలమ్మ గారికి  మాత్రం  ఇష్టం లేదు. పెళ్లి తర్వాత  నటనకు దూరం కావాల్సి వస్తుందేమో అని ఆమె భయం. అయినా  జీవి కృష్ణారావు గారు ఆమె వెంటే పడుతూ పెళ్లి చేసుకుందాం అని అడుగుతూ ఉండేవారు. ఆయన  ప్రవర్తన నచ్చడంతో  ఇక  కృష్ణారావుతో పెళ్ళికి ఒప్పుకుంటూ ఒక  కండిషన్‌ పెట్టారు నిర్మలమ్మ గారు.  మన పెళ్లయ్యాక కూడా  నేను  నటిస్తాను.   దానికి మీరు అడ్డు చెప్పకూడదు’ అంది.

నిర్మలమ్మ గారి షరతులకు జీవి కృష్ణారావు గారు తలూపారు.  అలా ఇద్దరు ఒకటయ్యారు.  అయితే,  పెళ్లయ్యాక నిర్మలమ్మ గారికి  పిల్లలు పుట్టలేదు.  దాంతో ఆమె బాగా  డిప్రెషన్‌ కి గురి అయింది. ఆ సమయంలోనే  నిర్మలమ్మ గారు  సినిమాలకి దూరం జరిగారు.   కొన్నాళ్ళు అసలు  ఆమె ఎవరికీ కనిపించలేదట.  మరోపక్క ఆమె  భర్త కృష్ణారావుకి ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా అవకాశాలు  తగ్గాయి.

ఆదాయం లేకుండా పోయింది.  అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలోనే   ఇద్దరు నాటక రంగంపై  దృష్టి పెట్టి.. ఎన్నో నాటకాలు వేశారు.  ఆ క్రమంలోనే  1961 లో కృష్ణ ప్రేమ అనే  సినిమాలో నిర్మలమ్మ గారికి  అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచే ఆమె  సెకండ్‌ ఇన్నింగ్స్‌  మొదలు అయింది. ఇక  ఆ తర్వాత నుంచి ఆమె  వెనుతిరిగి చూసుకోలేదు.

అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ దగ్గర  నుంచి  మొదలు పెడితే..  చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున  వరకు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది సూపర్‌ స్టార్లకి ఆమె  అమ్మగా  బామ్మగా  నటించి తెలుగు తెరకు  నిర్మలమైన నటనను అందించి వెళ్లిన గొప్ప నటి  నిర్మలమ్మ గారు.   ఎలాంటి సీన్‌ అయిన ఎంతో సాధారణంగా ఆమె నటిస్తోంది.  ఆమె సినిమా సెట్స్  ఒక తల్లిలా ఆదరించేదట.

అన్నట్టు  నిర్మలమ్మ గారు  కవిత అనే ఒక ఆడ పిల్లను దత్తత తీసుకుంది. అలా ఆమెకు  ఒక మనమడు  ఉన్నాడు.  అతని పేరు  విజయ్‌ మాదాల. తన నట వారసుడిగా  కూడా  ఇతన్ని నిర్మలమ్మ గారు  ‘పడమట సంధ్యారాగం’ అనే సినిమాలో గణపతి  పాత్రలో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  ఈయనకు శోభా అనే అమ్మాయితో వివాహం జరిగింది.  ప్రస్తుతం ఈయన అమెరికాలోనే సెటిల్ అయ్యారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper