spot_img
Homeట్రెండింగ్ న్యూస్Delhi: డేటింగ్ యాప్ లో పరిచయం.. చొంగ కార్చుకుంటూ వెళ్తే జరిగింది ఇదీ!

Delhi: డేటింగ్ యాప్ లో పరిచయం.. చొంగ కార్చుకుంటూ వెళ్తే జరిగింది ఇదీ!

Delhi: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. అలాగే డబ్బు సంపాదనకు కొందరు అష్ట వక్రమార్గాల్లో పయనిస్తూ ఉంటారు. అగ్గి పుల్ల, సబ్బు బిల్ల, కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగానే.. అడ్డదిడ్డంగా సంపాదించడానికి అడ్డగోలు పనులన్నీ చేస్తూ ఉంటారు. అదే అలాంటి ఓ ముఠాకు యువకుడు ఆన్లైన్లో చిక్కాడు. ఆ తర్వాత వారు చేసిన పనికి నిర్ఘాంతపోయాడు. చివరికి న్యాయం కోసం పోలీసు మెట్లు ఎక్కాడు.

ఢిల్లీలోని సంఘం విహార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (ఇతడు స్వ********) డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. కొద్దిరోజులు ఇద్దరి మధ్య మాటలు నడిచాయి. ఆ తర్వాత అవి వాట్సప్ చాటింగ్ ల దాకా వెళ్ళాయి. అయితే అవతలి వ్యక్తి పన్నాగం తెలియని సంగమ్ విహార్ యువకుడు.. ఇద్దరం కలుసుకుందామని మెసేజ్ పెడితే.. అవతలి వ్యక్తి ఓకే చెప్పాడు. సంగమ్ విహార్ ప్రాంతానికి రావాలని ఆ యువకుడు ఆఫర్ ఇవ్వడంతో.. ఆ వ్యక్తి కూడా సమ్మతం తెలిపాడు. అసలే స్వ******** కావడంతో అతనితో శా*** సు* పంచుకోవాలని ఉబలాటపడ్డాడు. అయితే వారిద్దరు కలుసుకునే రోజు రానే వచ్చింది సంగం విహార్ ప్రాంతానికి చెందిన యువకుడు చెప్పిన ప్రదేశానికి ముందే వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఆ డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగానే ఆ డేటింగ్ యాప్ వ్యక్తికి సంబంధించిన మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. సంగం విహార్ ప్రాంతానికి చెందిన యువకుడిని చితకబాదారు. అతడి ఫోన్
లాక్కున్నారు. ఫోన్ పే పాస్ వర్డ్ తెలుసుకొని.. అతడి ఖాతాలో ఉన్న ₹75,000 బదిలీ చేసుకున్నారు. అతడిని తీవ్రంగా గాయపరిచి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

శక్తినంత కూడ తీసుకొని బాధిత యువకుడు అక్కడి నుంచి మెల్లిగా తన ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్లకు చెబితే పరువు పోతుందనే భయంతో.. తనకు రోడ్డు యాక్సిడెంట్ జరిగిందని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సిసి ఫుటేజ్ పరిశీలించారు. అతడి ఫోన్ పే ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయిన నెంబర్లను పరిశీలించారు. ఆ దాడి చేసిన వ్యక్తులు ఇద్దరిని హర్యానా రాష్ట్రం ఫరిదా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తిని సరితా విహార్ ప్రాంతానికి చెందిన అమన్ సింగ్ గా గుర్తించారు. వారి ముగ్గురిపై కేసులు నమోదు చేశామని డిసిపి అంకిత్ చౌహన్ తెలిపారు. డిసెంబర్ 9న ఈ ఘటన జరగగా.. పోలీసులు విచారణ నిర్వహించి గత గురువారం వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ లలో పరిచయమయ్యే వ్యక్తులను నమ్మకూడదని హితవు పలికారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Oktelugu Epaper