1947 Gold Price: 1947.. గురించి ప్రతి భారతీయుడికి తెలుసు. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ పాలకుల నుంచి భారత్ కు విముక్తి కలిగిన తర్వాత అప్పటి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పటి వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి? అని తెలుసుకోవాలని నేటి తరం వారికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఆ కాలంలో బంగారం, పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత మారిపోయాయి? అనే విషయాలను పరిశీలిద్దాం.
1947లో బంగారం ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడు 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88. అంటే ఒక గ్రామ బంగారం ధర 88 పైసలు మాత్రమే. అప్పట్లో చాలామంది బంగారం కొనుగోలు చేసేవారు కాదు. కొంతమంది వద్ద మాత్రమే బంగారం ఉండేది. అంతేకాకుండా కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం వల్ల బంగారానికి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం బంగారం ధరించాలని అనుకుంటున్నారు. దీంతో బంగారానికి బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.1.55 లక్షలకు చేరుకుంది. గత 80 ఏళ్లలో ధరలు ఏ విధంగా పెరిగాయో అర్థమవుతుంది.
బంగారంతో పాటు ఆ కాలంలో పెట్రోల్ ధరలు కూడా తక్కువగానే ఉండేవి 1947లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 115 కి చేరింది. అయితే పెట్రోల్ ధరలు దశాబ్ద కాలంలోనే విపరీతంగా పెరిగాయి. ఈ సమయంలో వాహనాల కొనుగోళ్ళు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజలకు సైతం వాహనాలు తప్పనిసరిగా కావడంతో పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. కానీ నిత్యవసరాల్లో పెట్రోల్ కూడా ఉండడంతో వాటి ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇక ఆ కాలంలో లీటర్ పాలు ద్వారా కేవలం 12 పైసలు మాత్రమే. ప్రస్తుతం లీటర్ పాలు.60 వరకు విక్రయిస్తున్నారు. ఉదయం లేవగానే పాలతోనే దినచర్య ప్రారంభమవుతుంది. కానీ వాటి ధరను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ల కాలంలో ధరలు ఈ విధంగా ఉంటే.. భవిష్యత్తులో ఇవి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అయితే ధరలు ఎలా ఉన్నా కూడా అవసరాలకు తగ్గట్టుగా ఖర్చులు ఉంటే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారకుండా ఉంటుందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏ వస్తువైనా వృధా చేయకుండా అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని.. అలాగే దుబారా ఖర్చులు నివారించాలని చెబుతున్నారు. దీంతో ధరలు పెరిగినా కూడా సగటు జీవితంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉంటుందని అంటున్నారు.