Homeహెల్త్‌Good Sleep Tips: మంచి నిద్ర కోసం సూపర్ టిప్స్..

Good Sleep Tips: మంచి నిద్ర కోసం సూపర్ టిప్స్..

Good Sleep Tips: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. సరైన నిద్ర కూడా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటినిండా నిద్రపోయేవారి సంఖ్య చాలా తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకువగా ఉండడంతో పాటు.. మొబైల్స్, లాప్టాప్ తో గడపడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, పని భారం వల్ల కూడా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సరైన నిద్రపోవడం లేదు. అయితే ఇలాంటివారు కొన్ని ప్రత్యేకంగా టిప్స్ పాటించడం వల్ల గాడ […]

Good Sleep Tips: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. సరైన నిద్ర కూడా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటినిండా నిద్రపోయేవారి సంఖ్య చాలా తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకువగా ఉండడంతో పాటు.. మొబైల్స్, లాప్టాప్ తో గడపడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, పని భారం వల్ల కూడా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సరైన నిద్రపోవడం లేదు. అయితే ఇలాంటివారు కొన్ని ప్రత్యేకంగా టిప్స్ పాటించడం వల్ల గాడ నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..

ఉద్యోగం లేదా వ్యాపార రీత్యా రోజంతా బిజీగా ఉండేవారు ఇంటికి రాగానే వెంటనే నిద్రపోయే ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేయకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం అలసట నుంచి బయటపడుతుంది. అప్పుడు కండరాలు రిలాక్స్ అవుతాయి. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే రాత్రి సమయంలో చల్లటి నీటితో కంటే వేడి నీటితో చేయడమే ఉత్తమం..

నిద్ర భంగం కలగడానికి ఆహార పదార్థాలు కూడా కారణమవుతుంటాయి. చాలామంది రాత్రి సమయంలో రోస్టెడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఇవి తొందరగా డైజెషన్ కాకుండా ఇబ్బంది పడతాయి. నిద్రపోయిన సమయంలో కూడా ఇవి జీర్ణం కాకుండా అనేక సమస్యలను తీసుకొస్తాయి. ఫలితంగా నిద్రకూ బంధం కలుగుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రాత్రి సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేదా రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పాలలో ఉండే పదార్థాలు తొందరగా నిద్ర పట్టే విధంగా చేస్తాయి.

మానసిక ఒత్తిడి ఉన్నవారు కూడా రాత్రి సరిగ్గా నిద్రపోలేరు. ఇలాంటివారు రాత్రిళ్ళు టీవీలు, మొబైల్స్ చూడకుండా ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి. లేదా కుటుంబ సభ్యులతో సరదాగా ఉండాలి. అంతేకాకుండా ఏదైనా ఒక మంచి పుస్తకం కొనుగోలు చేసి.. రోజుకో కథ చదువుతూ ఉండడంవల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీంతో గాఢ నిద్రపట్టే అవకాశం ఉంటుంది.

మంచి నిద్ర రావడానికి గదిలోని రూము ప్రశాంతంగా కూడా ఉండాలి. కొన్ని గదుల్లో వస్తువులు చిందరవంతంగా ఉంటే నిద్రపట్టే అవకాశం ఉండదు. అందువల్ల బెడ్ రూమ్ను ప్రశాంతంగా, నీట్ గా ఉంచుకోవాలి. అలా చేస్తే మనసుకు ఉల్లాసం కలిగి వెంటనే నిద్రపట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బెడ్రూంలో ఉండే లైట్ డల్ గా ఉండడం వల్ల తొందరగా నిద్ర పట్టి అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper