Homeఅంతర్జాతీయంYakuza Mafia: ప్రపంచాన్ని వణికించిన యకుజా మాఫియా గ్యాంగ్ కథ.. ఎలా అంతర్థానమయ్యారంటే..

Yakuza Mafia: ప్రపంచాన్ని వణికించిన యకుజా మాఫియా గ్యాంగ్ కథ.. ఎలా అంతర్థానమయ్యారంటే..

Yakuza Mafia: ప్రపంచంలో జపాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ మిగతా వాటికంటే బలంగా ఉంటుంది. రోబోటిక్, కల్చర్ వంటి వాటిల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆటోమోబైల్ రంగంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు క్రమశిక్షణతో పాటు పరిశుభ్రతను పాటించడంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే జపాన్ దేశంలో కూడా ఒకప్పుడు క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాంగ్ స్టర్ ఉండేంది. […]

Yakuza Mafia: ప్రపంచంలో జపాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ మిగతా వాటికంటే బలంగా ఉంటుంది. రోబోటిక్, కల్చర్ వంటి వాటిల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆటోమోబైల్ రంగంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు క్రమశిక్షణతో పాటు పరిశుభ్రతను పాటించడంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే జపాన్ దేశంలో కూడా ఒకప్పుడు క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాంగ్ స్టర్ ఉండేంది. ఈ గ్యాంగ్ గ్రూపులు విజిటింగ్ కార్డులు ఇచ్చి మరీ క్రైమ్ చేసేవారు. ఇంతకీ ఆ గ్యాంగ్ పేరేంటి? ఇప్పడు ఆ గ్యాంగ్ పరిస్థితి ఏంటీ?

400 ఏళ్ల కిందటి జపాన్ చరిత్రలోకి వెళితే.. Yakuza అనే పేరు వినిపిస్తుంది. ఈ పేరుతో ఉన్న గ్యాంగ్ ఇతరులను గడగడలాడించేంది. యకూజా అంటే పనికిరానిది అని అర్థం. మమ్మల్ని పనికిరానివాళ్లు అని అన్నారని వీళ్లు ఆ పేరు పెట్టుకున్నారు. ఈ గ్రూపులో సమురాయి, టేకియా, బాకుటో అనే గ్యాంగ్స్ కలిసి ఉండేవి. వీళ్లు ప్రత్యేకంగా కార్యాలయాలు పెట్టి మరీ క్రైం చేసేవాళ్లు. వీరికి తోడుగా 1915లో యమగూచి గూమీ అనే గ్యాంగ్ తోడైంది. వీరికి వచ్చిన డబ్బుతో ఏకంగా ఎంటర్టైన్మెంట్ కంపెనీనే ప్రారంభించారు. దీని ద్వారా పాపులర్ సినీస్టార్స్ ను వీళ్లు కంట్రోల్ లో ఉంచుకునేవారు. అలాగే డ్ర..గ్స్ స్మ..గ్లింగ్, పొలిటికల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ బాగా డబ్బు సంపాదించేవారు. ఈ గ్రూపులన్నీ రిచెస్ట్ గ్రూప్ గా మారాయి.

అయితే వీరికి వ్యతిరేకంగా జపాన్ ప్రభుత్వం కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. వీరితో కంపెనీలు ఒప్పందాలు చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. దీంతో యకూజా కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఎంతలా అంటే 1963లో యకూజా గ్రూప్ లో 1,84,000 మంది సభ్యులు ఉంటే.. 2025 ఏప్రిల్ నాటికి 9400 మందికి తగ్గారు. ఒకప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన వారు ఇప్పుడు సైకిళ్లపై తిరుగుతున్నారు. దీంతో వీరి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో తాము ఇక ఎలాంటి క్రైం చేయలేమని యకూజా, యమగూచి గూమీ గ్రూప్ సభ్యులు ప్రభుత్వానికి విన్నవించారు.

దీనిని భట్టి తెలస్తుందేంటే.. తప్పుడు దారిలో వెళ్తున్న వారు ఎంత పవర్ ఫుల్ అయినా.. ఏదో ఒకరోజుకు జీరో రావాల్సిందే. ఇప్పుడు జపాన్ లో ఎలాంటి చిన్న క్రైమ్ జరిగినా కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన రూల్స్ పెట్టింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper