Mahindra Scorpio Lifestyler: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా కంపెనీకి పెట్టింది పేరు. బలమైన ఇంజన్ తో పాటు బాడీ నిర్మాణం స్ట్రాంగ్ గా ఉండడంతో చాలా మంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. అయితే ఈ కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి కొత్త వెహికల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. ఇందులో భాగంగా త్వరలో ‘స్కార్పియో లైఫ్ స్టైలర్’ పేరుతో కొత్త కారును తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే రిలీజ్ చేసింది. వీటిని చూసి కారు ప్రియులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఇంతకీ ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Mahindra కంపెనీకి చెందిన ఎన్ సిరీస్ ఆధారంగా ఈ కొత్త కారు ‘స్కార్పియో లైఫ్ స్టైలర్’ తయారవుతోంది. సాధారణంగా మహీంద్రా కారు డిజైన్ అద్భుతంగా ఉంటుంది. కొత్తగా రిలీజ్ చేసిన ఫొటోలను భట్టి చూస్తే ఈ కొత్త కారు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ కారుకు ఇరువైపులా డబ్బా ఆకారంలో ఎల్ ఈడీ లైట్స్ ఉండనున్నాయి. ఫ్రంట్ సైడ్ లో భారీ క్రోమ్ స్టడెడ్ రెక్టాంగిల్ గ్రిల్ ఆకట్టుకోనుంది. అగ్రెసివ్ గా ఉండే బంఫర్, ఎల్ ఈడీ ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ బ్లాక్ సర్దౌండ్స్ ఉన్నాయి. 18 అంగుళాల డైమండ్ కట్ వీల్స్ తో ఆకట్టుకోగా.. బ్యాక్ సైడ్ మాత్రం సింపుల్ డిజైన్ ఇచ్చారు. టెయిల్ గేడ్ పై మహీంద్రా పేరు కనిపిస్తుంది.
ఇంటిరీయర్ విషయానికొస్తే.. ఈ కొత్త కారులో అల్యూమినియంతో కూడిన సరికొత్త ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండనుంది. ఫియానో బ్లాక్ ట్రిమ్, పెద్ద సెంటర్ ఆర్మ్ రెస్ట్ కన్పిస్తోంది. భారీ టచ్ స్క్రీన్ ఇన్ పో టైన్మెంట్ సిస్టమ్ తో పాటు సింగిల్ ఫేన్ సన్ రూప్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ తో పాటు ఫుష్ బటన్, ఆడియో సిస్టమ్ వంటి వి ఉండనున్నాయి.
మహీంద్రా కంపెనీ తన కార్లలో సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా కొత్త కారులో 2 అడాస్ సహా సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్, ఈ బీడీ తో పాటు రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే 540 డిగ్రీ కెమెరా సిస్టమ్ తో పాటు ఇందులో అప్ డేట్ చేసిన పవర్ ట్రెయిన్ ఆప్షన్లు ఉంటాయి.
బలమైన ఇంజిన్ మహీంద్రా కారు ప్రత్యేకత. స్కార్పియో లైఫ్ స్టైలర్ కారులో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్లు ఉండనున్నాయి. వీటిలో టర్బో పెట్రోల్ ఇంజిన్ 203 పవర్ అందించగా.. 380 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. డీజిల్ ఇంజిన్ లో 175 పవర్ ను అందిస్తూ.. 400 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది.
ఈ కారును 2027 ఏప్రిల్ లో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిని రూ.19 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చి కార్లకంటే ఈ కొత్త కారు ఆకట్టుకునే విధంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అలాగే ఇది మార్కెట్లోకి వస్తే .. టయోటా హైలక్స్, ఇసుజు డీ మాక్స్ అనే కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.