Homeజాతీయ వార్తలుBangalore Parking Rules: ఇంటి ముందు కారు పార్క్ చేస్తే రూ.25వేలు.. వాహనదారులకు అలెర్ట్..

Bangalore Parking Rules: ఇంటి ముందు కారు పార్క్ చేస్తే రూ.25వేలు.. వాహనదారులకు అలెర్ట్..

Bangalore Parking Rules: పట్టణాలు, నగరాల్లో పార్కింగ్ సమస్యను చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న గల్లీలో అయితే వాహనాలు రోడ్లపైనే ఉంచుతారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతాయి. అయితే ఒక్కోసారి వాహన యజమానులను దీనిపై అడగగా గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో చేసేది ఏమీ లేక ఇబ్బందిగానే పాదాచారులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనాల పార్కింగ్ పై కొత్త నిబంధనలను తీసుకురానున్నారు. ఇకపై ఇంటి ముందు వాహనాలు పార్కింగ్ చేస్తే […]

Bangalore Parking Rules: పట్టణాలు, నగరాల్లో పార్కింగ్ సమస్యను చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న గల్లీలో అయితే వాహనాలు రోడ్లపైనే ఉంచుతారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతాయి. అయితే ఒక్కోసారి వాహన యజమానులను దీనిపై అడగగా గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో చేసేది ఏమీ లేక ఇబ్బందిగానే పాదాచారులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనాల పార్కింగ్ పై కొత్త నిబంధనలను తీసుకురానున్నారు. ఇకపై ఇంటి ముందు వాహనాలు పార్కింగ్ చేస్తే రూ. 25వేల జరిమానాను విధిస్తారు. అయితే ఇంత జరిమానాను ఎక్కడ విధిస్తారు? ఈ నిబంధనలు ఎవరు అమలు చేయనున్నారు?

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం ఎప్పుడూ బిజీ వాతావరణాన్ని తలపిస్తుంది. దీంతో ఇక్కడ వాహనదారులు కూడా పార్కింగ్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA)’కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకురానుంది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాహన యజమానులు ఇకనుంచి ఏడాదికి ఒకసారి రెసిడెన్షియల్ పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 25000 చెల్లించి పార్కింగ్ పర్మిషన్ పొందాలి. వీటిలో వివిధ కార్లకు రకరకాల ఫీజులు ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్ కారు అయితే రూ.15000, సెడాన్ కారు అయితే రూ. 20000, స్పోర్ట్స్ కార్లకు రూ. 25000 చెల్లించాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఈ ఫీజులు కేవలం పార్కింగ్ స్థలాలు ఉన్న ఇళ్లకు మాత్రమే.

అపార్ట్మెంట్ లేదా నివాస పరిసర ప్రాంతాల్లో సొంత పార్కింగ్ స్థలం లేని వారు వాహనాలు అడ్డదిడ్డంగా లేదా రోడ్డుపై పార్కింగ్ చేస్తే రూ. 25వేల జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా విధించిన కూడా ఏడాది మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత పార్కింగ్ కు సరైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అయితే కొత్తగా నిర్మించుకునే ఇళ్లలో కచ్చితంగా వాహనాలకు సంబంధించిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని జి బి ఏ ముసాయిదాలో పేర్కొంది. కొత్తగా ఇల్లు నిర్మించేవారు ట్రాఫిక్ కోసం ఆరు మీటర్ల రోడ్డు, పాదాచారుల కోసం 1.8 మీటర్ల ఫుట్ పాత్ కాళీగా ఉంచాలని నిబంధన ఉంది. ఈ నిబంధనల వల్ల ట్రాఫిక్ ని నియంత్రించే అవకాశం ఉందని భావిస్తుంది. వీధుల్లో పార్కింగ్ కట్టడి చేస్తూ.. వీరికి దూరంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోబోతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper