Independence Day India: ప్రతి ఏడాది ఆగస్టు 15 రాగానే భారతదేశం మొత్తం జెండా పండుగలో మునిగి ఉంటుంది. ప్రత్యేక ప్రాంతాల్లో ప్రముఖులు జెండాను ఎగరవేస్తుంటారు. అలాగే జనవరి 26వ తేదీన కూడా జెండాను ఎగరవేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించారా? ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధానమంత్రి జెండా ఎగరవేస్తే.. జనవరి 26న రాష్ట్రపతి ఫ్లాగ్ డే నిర్వహిస్తారు. అయితే ఈ రెండుసార్లు జెండా ఎగరవేయడంలో తేడా ఉంటుంది. అదేంటో చూద్దాం..
1947 ఆగస్టు 15న భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది. అందుకోసం ప్రతి ఏడాది ఈ రోజున దేశ రాజధానిలోని ఎర్రకోట తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రముఖ ప్రదేశాల్లో జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తారు. అయితే ఈ సమయంలో జెండా కింద ఉంటుంది. దానిని పైకి లాగి అక్కడ జెండాను ఎగరవేస్తారు. అందుకు అర్థం ఏంటంటే.. ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ కు సంబంధించిన జెండాను కిందికి దించి.. భారతదేశ జెండాను పైకి ఎత్తినట్లు చూపించడం కోసం ఇలా చేస్తారు.
అయితే భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 26న కూడా జెండా వందనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రోజున రాష్ట్రపతి జెండాను ఎగరవేస్తారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు మాత్రమే జెండాను ఎగరవేస్తారు. ఈ సందర్భంలో జెండా అప్పటికే పైన కట్టేసి ఉంటుంది. అక్కడి నుంచే జెండాను విప్పుతారు.
ఈ విధంగా రెండు జెండా పండుగ కార్యక్రమాల్లో తేడా ఉంటుంది. ప్రతి ఏడాది జెండా పండుగలో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలు ఆలపిస్తూ స్వాతంత్ర్య నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటారు. ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు అప్పటి విషయాలను చెబుతూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది ఒక్కటి లేదా రెండు రోజులు మాత్రమే దేశం గురించి ఆలోచించకుండా ప్రతిరోజు దేశం కోసం ఎంతో కొంత శ్రమించాలని కొందరు చెబుతూ ఉంటారు.
జెండా పండుగలు అనగా దేశంలో జరిగిన నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధికి ప్రణాళికలు వేయడం. అందువల్ల నిన్నటి వరకు ఏం చేశాం.. రేపు చేయబోయేది ఏంటి అనేది నిర్ణయించుకొని ముందుకు సాగాలని పెద్దలు చెబుతూ ఉంటారు.