Pilot Rohith Reddy Farm House Controversy: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పరిణామం రాజకీయాలలో కీలకమైన చర్చకు దారితీసింది. సరిగ్గా మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల గతిని పూర్తిగా మార్చేసింది. నాడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా గులాబీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వినిపించాయి. స్వయంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ఈ వ్యవహారాలను బయటపెట్టారు. అంతేకాదు సిసి టీవీలలో రికార్డు అయిన దృశ్యాలను మీడియా ప్రతినిధుల సమక్షంలో వెలుగులోకి తీసుకొచ్చారు.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
అంతేకాదు, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగించారు. దీంతో ఆ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. గులాబీ పార్టీ విజయం సాధించింది. ఇక ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం.. పెద్దగా ఆధారాలు సేకరించలేకపోవడంతో.. ఈ కేసు మొత్తం నీరుగారిపోయింది. ఒకరకంగా తెలంగాణ రాజకీయాలలో రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఈ కేసును ఆధారంగా చేసుకొని అమిత్ షాను.. బిఎల్ సంతోష్ ను లాగాలని.. కేసులు పెట్టాలని కేసీఆర్ ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ వ్యవహారం నాడు గులాబీ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే లాభం చేకూర్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెరపైకి కనిపించిన నాటి ప్రజాప్రతినిధులు 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం విశేషం.
ఇప్పుడు అదే మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రం ద్వారా రోహిత్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మాదకద్రవ్యాల పార్టీ నిర్వహిస్తూ దొరికిపోయారు. పోలీసులు వైద్యుల సమక్షంలో నిర్వహించిన పరీక్షలలో రోహిత్ రెడ్డికి పాజిటివ్ రిపోర్టు రావడం విశేషం. రోహిత్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆ పార్టీలో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ సాగిస్తున్నారు.
రాజకీయాలు అన్ని రోజుల ఒకే విధంగా ఉండవు. అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే అడ్డం తిరిగితే.. ప్రతిదీ కూడా నెగిటివ్ గానే మారుతుంది. నాడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కేసీఆర్ గాయి గత్తర చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు అదే ఫామ్ హౌస్ లో నాడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి డ్ర*గ్స్ కేసులో దొరికిపోయారు. దీనినే కాల మహిమ అంటారు. మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇది రోహిత్ రెడ్డికి.. ఆయనను వెనుకుండి నడిపించిన కేసీఆర్ కు అర్థమయ్యే ఉంటుంది.
