Journalism Career: మూడు పువ్వులు ఆరు కాయలు.. అనే సామెత మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం.. ఈ సామెత ఈ మీడియా అధినేతకు అచ్చ గుద్దినట్టు సరిపోతుంది. అప్పట్లో ఆయన ఓ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ఓ పార్టీ అధినేత సతీమణితో అతడు అంటకాగాడు. ఆమె అతనికి అప్పట్లో డబ్బు సహాయం చేసింది. దీంతో ఆ రిపోర్టర్ డబ్బు తీసుకొచ్చి ఓ పత్రికను కొనుగోలు చేశాడు.
ఆ తర్వాత తన అసలు సిసలైన మీడియా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. పాడుబడ్డ భవంతులను లీజుకు తీసుకొని.. అందులో జిల్లా కార్యాలయాలు నిర్వహించేవాడు. ఇక రాష్ట్రస్థాయిలో అయితే ఒక సాధారణ భవంతిలో కేంద్ర కార్యాలయం నిర్వహించేవాడు. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు దగ్గర వ్యక్తిగా మారిపోయాడు. ముఖ్యంగా ఒక పార్టీకి అయితే తన పత్రికను కరపత్రంగా మార్చేశాడు. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో అడ్డగోలుగా దండుకునేవాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరి దగ్గర వసూలు చేయించేవాడు. తద్వారా అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు..
మీడియాను అడ్డం పెట్టుకొని సంపాదించిన డబ్బుతో ఒక ఛానల్ ఏర్పాటు చేశాడు. అటుపత్రిక, ఇటు ఛానల్ ద్వారా అంతకుమించి అనే స్థాయిలో సంపాదించడం మొదలుపెట్టాడు.. మొదటినుంచి బ్లాక్మెయిలింగ్ జర్నలిజంలో అతడు సిద్ధహస్తుడు. పైగా రిపోర్టర్ గా చేసిన అనుభవం ఉండడంతో అన్ని లూప్ హోల్స్ అతనికి తెలుసు. పైగా తన పత్రికలో తనకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులను మాత్రమే నియమించుకున్నాడు. వివిధ రాజకీయ పార్టీల వ్యవహారాలను.. అంతర్గత విషయాలను అతడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. తెలుసుకోవడం మాత్రమే కాదు తన పత్రికలో బీభత్సంగా రాసేస్తాడు. అయితే అతడి జర్నలిజం లో ఉన్న బ్యూటీ ఏంటంటే.. అతడు రాసే ఏ నెగిటివ్ స్టోరీ కైనా సరే ఫాలో అప్ ఉండదు. ఒక నెగిటివ్ స్టోరీ కి ఫాలో అప్ లేదూ అంటే తెర వెనుక ఏదో జరిగిందని అర్థం. కాకపోతే రిపోర్టర్ల కష్టాన్ని ఆ పత్రిక అధిపతి తన డబ్బు సంపాదనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఒకప్పుడు 20 లక్షలతో ఒక పత్రికను కొనుగోలు చేసిన అతడు.. ఈరోజు వందల కోట్లకు ఎదిగాడు అంటే.. అతని వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరిదైన ప్రాంతంలో 200 కోట్ల ఖర్చుతో ఏడు అంతస్తులలో కార్యాలయం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో కింది మూడంతస్తులు పత్రికకు.. ఆ తదుపరి మూడు అంతస్తులు ఛానల్ కు.. ఏడవ అంతస్తులో ఆ మీడియా అధిపతి ఉంటాడని సమాచారం. సమాజానికి ఎన్నో నీతులు చెబుతూ.. తన పత్రికలో ప్రతిరోజు సూక్తి ముక్తావలి ప్రచురిస్తూ.. విలువలు గల పాత్రికేయుడిగా బిల్డప్ ఇస్తున్న అతడు..తెర వెనుక చేస్తున్న వ్యవహారాలను మాత్రం బయటికి కనిపించనివ్వడు. అతడి సంపాదన చూసి.. అతడి వ్యవహారాలు చూసి.. అతడితో జర్నలిజం కెరియర్ మొదలుపెట్టిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.