Teenmar Mallanna Comments On Kavitha: గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత.. కవిత ఎటువైపు వెళ్తారు.. కమలం కండువా కప్పుకుంటారా? కాంగ్రెస్ గూటికి చేరుతారా? లేదా సొంత పార్టీ పెట్టుకుంటారా.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఆమె సొంతంగా పార్టీ పెడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆమె తన అనుచరులతో కార్యాచరణ సిద్ధం చేసుకున్నారని.. ఒక స్పష్టమైన అవగాహనతో ఆమె ఉన్నారని అంటున్నారు.
Also Read: చంద్రబాబును ఎన్డీఏకు దూరం చేసే కాంగ్రెస్ ప్లాన్
కవితకు రాజకీయాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి ఆమె జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమం ఒక స్థాయిలో జరుగుతున్న క్రమంలో దానికి పండగ రంగును అద్ది.. జనాల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. నాడు ఆమె బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించింది. ఆమె వెళ్లిన ప్రతిచోట జనాలు నీరాజనాలు పలికారు.. బహుశా ఆధ్వర్యంలో కవిత తన రాజకీయ ప్రయాణాన్ని సొంతంగా మొదలు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ.. ఆమెకు దక్కిన ప్రాధాన్యం కొంత పరిధి వరకు మాత్రమే ఉండేది. ఎప్పుడైతే ఆమె కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారో.. అప్పుడే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని గులాబీ అధిష్టానం భావించింది. దానికి తగ్గట్టుగానే మంగళవారం సస్పెన్షన్ వేటు విధించింది. వాస్తవానికి పార్టీ నుంచి బహిష్కరించాలి అనుకున్నప్పటికీ.. ఎందువల్ల తెలియదు గాని ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.
కవిత సస్పెన్షన్ తర్వాత రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని.. రేవంత్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని.. ఇదంతా కూడా రేవంత్ ఆడిస్తున్న ఆటగా మల్లన్న విమర్శించారు. కావాలని కాలేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఆరోపణలు చేశారని.. శాసనసభను దీనికి వేదికగా చేసుకున్నారని.. చివరికి గులాబీ పార్టీ అధినేత కుమార్తెను బరి పశువును చేశారని మల్లన్న ఆరోపించారు. అంతేకాదు గులాబీ అధినేత ఇంట్లో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అయితే కవిత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా.. కాషాయం పార్టీలో చేరుతారా.. అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం లభించదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆమెను తమ పార్టీలో చేర్చుకోబోమని బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి కవిత వచ్చారని MLC తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవ్వగా రాహుల్ గాంధీ అడ్డుచెప్పినట్లు, పార్టీ మారే విషయం తెలిసి KCR ఆమె పక్కకు పెట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో… pic.twitter.com/zT68YV9bPe
— (@dmuppavarapu) September 3, 2025