HomeతెలంగాణPolice Mamalu Whatsapp Group: ‘పోలీస్‌ మామలు’ వాట్సాప్‌ గ్రూప్‌ లోకి ఎస్ఐ ఎంట్రీ.. మందుబాబుల...

Police Mamalu Whatsapp Group: ‘పోలీస్‌ మామలు’ వాట్సాప్‌ గ్రూప్‌ లోకి ఎస్ఐ ఎంట్రీ.. మందుబాబుల పరుగో పరుగో.. ట్విస్ట్ అదిరింది

Police Mamalu Whatsapp Group: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నవారిని నియంత్రించేందుకు పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ నిర్వహిస్తుంటారు. ఇది నిత్యం చేసే పనే. అయితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. నిబంధనల ప్రకారం ఆయన ఫోన్‌ను తనిఖీ చేయగా, ‘పోలీస్‌ మామల స్క్వాడ్‌’ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ కనిపించింది. పోలీసు తనిఖీల […]

Police Mamalu Whatsapp Group: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నవారిని నియంత్రించేందుకు పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ నిర్వహిస్తుంటారు. ఇది నిత్యం చేసే పనే. అయితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపారు. నిబంధనల ప్రకారం ఆయన ఫోన్‌ను తనిఖీ చేయగా, ‘పోలీస్‌ మామల స్క్వాడ్‌’ పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ కనిపించింది. పోలీసు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కొందరు మందుబాబులు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారని తేలింది.

ఎస్సై సూపర్‌ ట్విస్ట్‌..
ఈ గ్రూప్‌లోని సభ్యుల నంబర్లు చూసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు చాకచక్యంగా వ్యవహరించారు. తాను కూడా ఆ గ్రూప్‌లో జాయిన్‌ అయి, అందరికీ షాక్‌ ఇచ్చే వీడియో రిలీజ్‌ చేశారు. ‘మామలూ.. మీ నంబర్లన్నీ సేవ్‌ చేసుకున్నా. త్వరలో కౌన్సెలింగ్‌ ఇస్తా‘ అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

Also Read: 20 మంది రాజీనామా.. ఆ పెద్ద చానెల్ లో బీభత్సమైన సంక్షోభం ఇది

ఎలా పనిచేసింది ఈ గ్రూప్‌..
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడొద్దనే ఉద్దేశంతో కొందరు మందుబాబులు వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల తనిఖీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ ఆపరేషన్ల గురించి సమాచారం పంచుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వ్యక్తులు, వారి స్నేహితులు సమాచారం ఇస్తున్నారు. దీంతో తనిఖీలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాలు గ్రూప్‌లో షేర్‌ చేసి, ఒకరికొకరు అలర్ట్‌ చేసుకుంటున్నారు.

పోలీసుల చర్యపై ప్రశంసలు..
ఎసై చాకచక్యమైన చర్యను నెటిజన్లు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ‘పోలీసులను మోసం చేయాలనుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది‘ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సంఘటన మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పించుకోలేరని గుర్తుచేస్తోంది.

ఈ సంఘటన మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, పోలీసులను మోసం చేయాలనుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేస్తోంది. ‘పోలీస్‌ మామలు‘ అనుకుంటే ‘పోలీసు మామ‘నే చిక్కుకున్నాడని ఈ ట్విస్ట్‌ నిరూపించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper