HomeతెలంగాణMedia Channel Crisis: 20 మంది రాజీనామా.. ఆ పెద్ద చానెల్ లో బీభత్సమైన సంక్షోభం...

Media Channel Crisis: 20 మంది రాజీనామా.. ఆ పెద్ద చానెల్ లో బీభత్సమైన సంక్షోభం ఇది

Media Channel Crisis: డిజిటల్ మీడియా కొడుతున్న దెబ్బకు ప్రధాన మీడియా విలవిలలాడిపోతోంది. సరైన ఆదాయం లేకపోవడంతో యాజమాన్యాలు కాస్ట్ కటింగ్ కు పాల్పడుతున్నాయి. అయితే కొన్ని చానళ్లు భారీగా లాభాలు ఉన్నప్పటికీ.. కాస్ట్ కటింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయి. అటువంటి ఛానల్ యాజమాన్యం బాగోతం ఇది.. Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే.. ఆ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం క్రితం […]

Media Channel Crisis: డిజిటల్ మీడియా కొడుతున్న దెబ్బకు ప్రధాన మీడియా విలవిలలాడిపోతోంది. సరైన ఆదాయం లేకపోవడంతో యాజమాన్యాలు కాస్ట్ కటింగ్ కు పాల్పడుతున్నాయి. అయితే కొన్ని చానళ్లు భారీగా లాభాలు ఉన్నప్పటికీ.. కాస్ట్ కటింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయి. అటువంటి ఛానల్ యాజమాన్యం బాగోతం ఇది..

Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

ఆ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం క్రితం ఏర్పాటయింది. ప్రస్తుత అధికార పార్టీకి భజన చేయడంలో ఆ ఛానల్ ముందు వరుసలో ఉంటుంది. ప్రభుత్వ పెద్దలతో ఆ ఛానల్ నిర్వాహకులకు గట్టి సంబంధాలు ఉన్నాయి. మొదట్లో హంగు ఆర్భాటంతో ఆ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇటీవల దక్షిణాది లోని ఓ రాష్ట్రంలో కూడా శాఖను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాస్ట్ కటింగ్ పేరుతో ఆ సంస్థలో 40 మంది ఉద్యోగులను బయటికి పంపించారు. ఆ సంఘటనను మర్చిపోకముందే ఇప్పుడు ఆ చానల్లో పెద్ద స్థానాలలో ఉండేవారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరులో సీఈవో.. మేనేజింగ్ ఎడిటర్.. ఇన్పుట్ ఎడిటర్.. ఆ ఛానల్ ఆధ్వర్యంలో వెలువడే డిజిటల్ పత్రిక ఎడిటర్.. హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉండే ఓ జిల్లా రిపోర్టర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ పెద్ద జిల్లా రిపోర్టర్.. ఆ ఛానల్ డిజిటల్ హెడ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా రాజీనామా చేసిన వారి సంఖ్య 20 మందికి పైగానే ఉంటుందని సమాచారం.

మొదట్లో ఆ యాజమాన్యం అనేక రకాలుగా బిల్డప్పులు ఇచ్చుకుంది. తమ ఉద్యోగులకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నట్టు.. ప్రతినెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నట్టు ప్రకటించుకుంది. అయితే ఈ ఆర్భాటం కొద్దిరోజుల వరకు దర్జాగా సాగింది. ఆ తర్వాత మేనేజ్మెంట్ అసలు రూపం బయట పెట్టుకోవడంతో ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇలా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. అధికార పార్టీ అండ ఉన్నప్పటికీ.. కాస్ట్ కటింగ్ కు పాల్పడటం ఆ యాజమాన్యం నిర్లక్ష్యమైన వైఖరికి కారణమని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో మీ భవిష్యత్తుకు డోకా లేదని చెప్పారని.. ఇప్పుడేమో జీతాలు కట్ చేస్తూ.. జీవితాలతో ఆడుకుంటున్నారని పాత్రికేయులు వాపోతున్నారు. అధికార పార్టీ అండ చూసుకొని ఆ ఛానల్ యాజమాన్యం రెచ్చిపోతోందని.. ఉద్యోగుల విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper