Secretariat secrets: సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీల భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హిల్ట్ పేరుతో ఒక పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వం దీని గురించి ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే..ఆ వ్యవహారం మొత్తం గులాబీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏకంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.. కేటీఆర్ హైదరాబాద్ నగరంలో ఉన్న పారిశ్రామిక వాడల్లోకి వెళ్లారు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఎంత విషం చిమ్మాలో.. అంత చిమ్మేశారు.. దీంతో స్వయంగా ఐటీ శాఖ మంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ పాలసీ గురించి తాము మాట్లాడలేదని.. చర్చల దశలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
హిల్ట్ పాలసీకి సంబంధించిన వ్యవహారం గులాబీ పార్టీకి చేరడానికి ప్రధానంగా ఇద్దరు అధికారులు కారణమని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. ఆ తర్వాత వారిపై వేటు వేసింది. ఈ వ్యవహారంతో సెక్రటేరియట్ లో ఏం జరుగుతోంది.. సీఎం ఓలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. ప్రభుత్వ విధానాలు రహస్యంగా ఉండాల్సిన చోట ఇలా బహిర్గతం కావడం పట్ల చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ఆ ఇద్దరు అధికారుల వ్యవహార శైలి తర్వాత సీఎంఓ లో తీసుకునే నిర్ణయాలు బయటికి వెళ్ళకుండా ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు తెలంగాణ సీఎంఓ గురించి ఓ సంచలన కథనం ప్రసారమైంది. దీనిని రాజ్ న్యూస్ అనే ఛానల్ ప్రసారం చేసింది. తెలంగాణ సీఎం ఓలో మాధవి అనే ఒక మేడం ఉన్నారట. ఆమె ఏం చెబితే సీఎం ఓలో అది జరుగుతుందట. అంతేకాదు తిరుపతిలో ఆమెకు విఐపి ప్రోటోకాల్ కూడా ఇప్పించారట. తెలంగాణ సీఎంఓ మొత్తాన్ని ఆమె శాసిస్తున్నారట. అనుకూలమైన అధికారులకు పోస్టింగులు కూడా ఆమె ఇప్పిస్తున్నారట. దీనికోసం భారీగానే వసూలు చేస్తున్నారట. పైగా ఆమెకు ప్రభుత్వంలో కీలకమైన నాయకుడి అండదండలు ఉన్నాయట.. అందువల్లే ఆమె ఏం చేసినా సరే సీఎం ఓలో చెల్లుబాటు అవుతోందట. వాస్తవానికి ఇలాంటి విషయాలను గులాబీ పార్టీ అనుకూల మీడియా లేదా ఆ పార్టీ మౌత్ పీస్ టెలికాస్ట్ చేయాలి. కానీ ఇంత నిగూడమైన సమాచారాన్ని గులాబీ పార్టీ అనుకూల మీడియా సంపాదించలేకపోయింది. దాని కంటే ముందుగానే రాజ్ న్యూస్ లో ఈ వార్త ప్రసారమైంది. ఇది నిజమా? అని గ్రూక్ ను అడిగితే నిరాధారం అని చెప్పింది. అయితే ఇదే రాజు న్యూస్ పేరుతో తెలంగాణ భవన్లో గులాబీ పార్టీ అనుకూల ఛానల్ ప్రసారాలు చేసేది. ఆ తర్వాత కొంతకాలానికి టీ న్యూస్ ఏర్పాటయింది. ఇప్పుడు ఇదే గులాబీ పార్టీకి రాజ్ న్యూస్ ప్రసారం చేసే కథనాలు సోషల్ మీడియాలో పోస్టింగులు అయ్యాయి. ఈ ప్రకారం చూసుకుంటే టీ న్యూస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రయత్నించడం లేదని అర్థమవుతోంది.
మేడమ్ సార్ మేడమ్ అంతే!
తెలంగాణ సీఎంవోలో మేడమ్ మాధవి గారి హవా
సీఎంవోలో ఆమె చెప్పిన పని జరగపోతే అంతే సంగతులు
తిరుపతిలో ఆమెకు వీఐపీ ప్రోటోకాల్ ఇప్పించింది ఎవరు?
తెలంగాణ సీఎంవో ను శాసిస్తున్న ఆ లేడీ షాడో సీఎం ఎవరు?
Video Credits – Raj News pic.twitter.com/R0dJdmv2wN
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2025