Homeఎంటర్టైన్మెంట్Jr NTR Tweet Viral: ఢిల్లీ హైకోర్టు కి కృతఙ్ఞతలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్..ట్వీట్ వైరల్!

Jr NTR Tweet Viral: ఢిల్లీ హైకోర్టు కి కృతఙ్ఞతలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్..ట్వీట్ వైరల్!

Jr NTR Tweet Viral: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలపై పడుతున్న ట్రోల్స్ హద్దు మీరుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలకు సంబంధించిన అభిమానులు తమ హీరోల కోసం బండ బూతులు తిట్టుకునే వారు. కానీ AI వచ్చిన తర్వాత ఈ ట్రోల్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. హీరోలకు సంబంధించిన ఫోటోలను ఉపయోగించి , ఇష్టమొచ్చిన విధంగా మార్ఫింగ్ చేస్తున్నారు. ఆ AI జనరేటెడ్ ఫోటోలను చూస్తే నిజమైన ఫోటో ఎదో, ఫేక్ ఫోటో ఎదో కనిపెట్టడానికి చాలా కష్టం గా ఉండేది. ఆ రేంజ్ లో మార్ఫింగ్ చేస్తుండడం తో ఇక సినీ తారలు తమ వ్యక్తిగత సమాచారాన్ని భద్రతా కల్పించాలంటూ హై కోర్టు మెట్లు ఎక్కారు. ముందుగా ఐశ్వర్య రాయి బచ్చన్ తో ఇది మొదలైంది. ఆ తర్వాత ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఈ అంశంపై హై కోర్టుని ఆశ్రయించారు.

వీళ్ళని చూసి అక్కినేని నాగార్జున, హృతిక్ రోషన్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా హై కోర్టు ని ఆశ్రయించి తమ వ్యక్తిగత సమాచారం విషయం లో భద్రతని పొందారు. ఇక రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లు కూడా ఈ విషయమై ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ కి భధ్రత మంజూరు చేసారో లేదో తెలియదు కానీ, ఎన్టీఆర్ కి మాత్రం నిన్ననే తన వ్యక్తిగత సమాచారానికి హై కోర్టు భధ్రత కల్పించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హై కోర్టు కి , హై కోర్ట్ జడ్జి కి, తన న్యాయవాదులకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘సోషల్ మీడియా నుండి నా వ్యక్తిగత సమాచారానికి భధ్రత కలిగించినందుకు ఢిల్లీ హై కోర్టు కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా నా కోసం పని చేసిన సుప్రీమ్ కోర్టు అడ్వొకేట్స్ డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డకార్,అదే విధంగా మిస్టర్ రాజేందర్ మరియు రైట్స్ & మార్క్స్ టీం కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ‘వార్ 2’ చిత్రం తో మన ముందుకొచ్చిన ఆయన, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ‘డ్రాగన్’ చిత్రం చేస్తున్నాడు. రెండు మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతానికి విరామం స్టేజి లో ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ మొదలు కానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
Oktelugu Epaper